Homeహైదరాబాద్latest NewsOTT News : డైరెక్ట్ ఓటీటీలోనే ‘సైరన్’ విడుదల

OTT News : డైరెక్ట్ ఓటీటీలోనే ‘సైరన్’ విడుదల

తమిళంలో జయం రవి హిరోగా నటించిన చిత్రం ‘సైరన్’. యాక్షన్‌, ఎమోషనల్ డ్రామాగా రూపొందించిన ఈ చిత్రానికి ఆంటోని భాగ్యారాజ్ దర్శకత్వం వహించగా సుజాత-అనూష నిర్మించారు. జయం రవి సరసన హీరోయిన్‌గా కీర్తి సురేశ్ నటించగా, మరో కీలక పాత్రలో అనుపమ పరమేశ్వరన్ కనిపించనుంది.

ఇది కూడా చదవండి: పాపం సీఎం రేవంత్ రెడ్డి ఇంగ్లిష్ పై ఫుల్ ట్రోల్స్..

కాగా ఈ సినిమా డిసెంబర్‌లో తమిళంలో థియేటర్స్‌లో విడుదల కావాల్సింది. కానీ ఇప్పుడు ఈ సినిమాను థియేటర్స్‌లో రిలీజ్ చేయడం లేదనీ, నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌పైకి రానుందని సమాచారం. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను జీ5 వారు దక్కించుకున్నట్టుగా తెలిసింది. తమిళంతో పాటు ఇతర భాషల్లోను ఈ నెల 26వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: తెలంగాణ TSRTC మరో గుడ్ న్యూస్

ఈ చిత్రంలో అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేసే హీరో ఎందుకు క్రిమినల్‌గా మారతాడు? జైల్లో అతనికి ఎలాంటి అనుభవం ఎదురవుతుంది? విడుదలైన తర్వాత అతను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది? అనేదే ఈ సినిమా కథ. కీర్తి సురేశ్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుంది.

ఇది కూడా చదవండి: ఆ పాటతోనే ప్రభుత్వం మారింది: కేటీఆర్

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img