తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం సీక్వెల్స్ హవా నడుస్తుందని చెప్పాలి. ఇక ఇప్పటికే బాహుబలి, బాహుబలి 2 సినిమా రాగా ప్రస్తుతం పుష్ప, పుష్ప 2 వస్తుంది అలాగే సలార్, సలార్ 2, దేవర, దేవర 2 సినిమాలు ప్రేక్షకులను అలరించబోతున్న విషయం తెలిసిందే. తాజాగా హీరో సిద్దు జొన్నల గడ్డ చేసిన డీజె టిల్లు కి సీక్వెల్ గా “డీజే టిల్లు స్క్వేర్” వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా మంచి పాజిటివ్ టాక్ తో ప్రేక్షకుల్ని అలరించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.125 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. ఈ రెండు సినిమాలు కూడా హిట్ అవడంతో దానికి సీక్వెల్ గా మూడోవ సినిమా కోసం ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. ఇక అందులో భాగంగానే “డీజే టిల్లు క్యూబ్” అనే టైటిల్ ను కూడా రిజిష్టర్ చేయించినట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమా విషయంలో ఇప్పటికే సిద్దు జొన్నలగడ్డ కథని కూడా రెడీ చేస్తున్నట్టుగా సమాచారం. అయితే ‘టిల్లూ క్యూబ్’ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే బుట్టబొమ్మను మేకర్స్ సంప్రదించగా ఆమె అంగీకరించినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.