2002లో ”ఈశ్వర్” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రభాస్.. ”బాహుబలి” సినిమా ద్వారా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నడు. ఇదిఇలా ఉంటే ఎప్పటికప్పుడు టాపిక్ ప్రభాస్ పెళ్లి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.తాజాగా ప్రభాస్ పెళ్లి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రభాస్ పెళ్లి దాదాపుగా ఫిక్స్ అయిందని తెలుస్తుంది.. అయితే ప్రభాస్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి హీరోయిన్ కాదనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ప్రభాస్ తల్లి బంధువు కూతురనీ.. ఆ అమ్మాయికి భారీగానే ఆస్తి ఉందని ఇండస్ట్రీలో వినిపిస్తుంది.ఈ విషయాలు తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే. దీనిపై అధికారక ప్రకటన రావాల్సి ఉంది.