కర్ణాటకలో రెండు HMPV (హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్) కేసులను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించిన కొన్ని గంటల్లోనే గుజరాత్‌లో మరో కేసు నమోదైంది. గుజరాత్‌లో రెండేళ్ల బాలుడికి హెచ్‌ఎంపీవీ వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. వైరస్ బారిన పడిన బాలుడికి అహ్మదాబాద్‌లోని చంద్‌ఖేడా ప్రాంతంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదకరమైన వైరస్ ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, అంటువ్యాధులు మరియు తీవ్రమైన వైద్య సమస్యలతో బాధపడేవారికి సోకే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే కింది జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా, మీరు HMPVతో పాటు ఇతర శ్వాసకోశ వైరస్‌ల బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు.
HMPV తీసుకోవలసిన జాగ్రత్తలు:
- కనీసం 20 సెకన్ల పాటు సబ్బు నీటితో తరచుగా చేతులు కడుక్కోవాలి
- చేతులతో కళ్లు, ముక్కు లేదా నోటిని తాకవద్దు
- అనారోగ్యంతో ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండండి
- జలుబు వంటి లక్షణాలు ఉన్న రోగులు దగ్గినప్పుడు … తుమ్మేటప్పుడు నోరు మరియు ముక్కును కప్పుకోవాలి.
- ఇతరులు వాడిన పాత్రలు ( కంచాలు.. గ్లాసులు) వాడవద్దు.
ALSO READ
BREAKING: HMPV వైరస్ కలకలం.. భారత్ లో మూడో కేసు నమోదు..!
భారత్ లో తొలి HMPV కేసు.. ఇకనైనా మాస్కులు వేసుకోండి..!