ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2: ది రూల్’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 32 రోజుల్లో రూ.1831 కోట్లు రాబట్టి సరికొత్త రికార్డు సృష్టించింది. ‘పుష్ప 2’ సినిమాకి మరో 20 నిమిషాల సీన్లు తో రీలోడెడ్ వెర్షన్‌ను జనవరి 11 నుంచి మళ్లీ థియేటర్లలో విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.తాజాగా ఈ రీలోడెడ్ వెర్షన్ ను వాయిదా వేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. సంబంధిత కంటెంట్ విషయంలో సాంకేతిక కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కొత్త సన్నివేశాలతో కూడిన ఈ సినిమాని ఈ నెల 17 నుంచి వీక్షించవచ్చని తెలిపింది.