మెగా ప్రిన్సెస్ క్లీన్ కారాను చూడాలని మెగా అభిమానులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. పాప ఎలా ఉంటుంది అని చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఫొటోలు, వీడియోల్లో ఎక్కడా ఫేస్ కనిపించకుండా ఉపాసన అండ్ కో. జాగ్రత్త పడుతున్నారు. అయితే తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో పాప ముఖం కనిపించింది. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆలయ ప్రాంగణంలో చరణ్, ఉపాసన, క్లీన్‌కారా వెళ్తుండగా తీసిన వీడియోలో ముఖం కనిపించింది. జన్మదినం సందర్భగా రామ్‌చరణ్ దంపతులు ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సతీమణి ఉపాసన, కుమార్తె క్లిన్ కారాతో కలసి స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందుకున్నారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలను చరణ్ కుటుంబానికి అందజేశారు. మంగళవారం సాయంత్రం తిరుమలకు చేరుకొని పద్మావతి నగర్‌లోని ఫోనిక్స్ వెంకటేశ్వర నిలయంలో బస చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో క్లిన్ కారా ముఖం కెమెరాలో పడింది. అయితే ఫొటోలు, వీడియోలు తీస్తున్నారని గమనించిన ఉపాసన వెంటనే ముఖం కవర్ చేసేశారు. క్లిన్ కారా అయితే క్యూట్‌గా భలేగా ఉందని నెటిజన్లు ఆ వీడియోలకు కామెంట్లు చేస్తున్నారు. ఇన్నాళ్లూగా దాచిన ముఖం రామ్‌చరణ్ పుట్టిన రోజు నాడు ఇలా కనిపించడంతో ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఉన్నారు. కానీ ఆ వీడియో తీస్తున్న సమయంలో ఉపాసన ముఖంలో అసహనం కనిపించింది.