Homeసినిమానక్సలైట్ పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్

నక్సలైట్ పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్

It is known that RamCharan is playing a key role in the movie Acharya.

It has already been revealed that Ram Charan’s character name is ‘Siddha’.

However, a new poster for the role was released on Monday.

It was a still with Chiranjeevi’s hand on Ram Charan’s shoulder from behind.

Chiranjeevi had a red cloth tied around his hand.

A short distance away from Charan, there was an AK-47 gun attached to a tree.

Charan Dress, depending on the gun, it is understood that he is playing the role of a Naxalite.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఆచార్య’ మూవీలో రామ్ చరణ్ ఒక అతిథి పాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ పాత్రకు సంబంధించి ఒక అప్‌డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్.

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘ఆచార్య’. సోషల్ మెసేజ్‌తో కూడిన మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది.

శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు.

ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

రామ్ చరణ్ పాత్ర పేరు ‘సిద్ధ’ అని ఇప్పటికే రివీల్ చేశారు. అయితే, ఆ పాత్రకు సంబంధించి కొత్త పోస్టర్‌ను సోమవారం విడుదల చేశారు.

రామ్ చరణ్‌ భుజంపై వెనుక నుంచి చిరంజీవి చేయి వేసిన స్టిల్ అది.

చిరంజీవి చేతికి ఎర్ర గుడ్డ కట్టి ఉండగా.. చరణ్‌కు కాస్త దూరంలో ఏకే 47 గన్‌ చెట్టుకు ఆన్చి ఉంది.

చరణ్ డ్రెస్, ఆ గన్ బట్టి ఆయన నక్సలైట్ పాత్ర పోషిస్తున్నారని అర్థమవుతోంది.

అయితే, దీనిపై చరణ్ కూడా క్లారిటీ ఇచ్చారు.

ఈ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన రామ్ చరణ్.. ‘‘కామ్రేడ్ మూమెంట్. ‘ఆచార్య’ సెట్స్‌లో నాన్న చిరంజీవి, కొరటాల శివ గారితో ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

కామ్రేడ్ అంటే ఇంకేముంది.. తాను నక్సలైట్ పాత్ర పోషిస్తున్నాని చరణ్ ఖరారు చేశారు.

Recent

- Advertisment -spot_img