రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మూడు ప్రముఖ బ్యాంకులపై నియంత్రణ నిబంధనలు ఉల్లంఘనల కారణంగా మొత్తం ₹1.29 కోట్ల జరిమానా విధించింది. కోటక్ మహీంద్రా బ్యాంకుకు రూ. 61.4 లక్షలు, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకుకు రూ. 38.6 లక్షలు, పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ. 29.6 లక్షల జరిమానా విధించింది. ఇది కస్టమర్ లావాదేవీల చట్టబద్ధతపై ప్రభావం చూపదని RBI స్పష్టం చేసింది.
బ్యాంకులపై ఫైన్ కి కారణమిదే:
- కొటక్ మహీంద్రా బ్యాంక్: రుణ విధానాలు మరియు స్టాక్ బ్రోకర్లకు ఇన్‌ట్రాడే ట్రేడింగ్ మార్జిన్ అవసరాలలో ఉల్లంఘనల కారణంగా అని తెలుస్తుంది.
- IDFC ఫస్ట్ బ్యాంక్: కస్టమర్ డ్యూ డిలిజెన్స్ మరియు KYC నిబంధనలను పాటించకపోవడం వల్ల అని తెలుస్తుంది.
- పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB): కస్టమర్ సర్వీస్ మరియు KYC సంబంధిత లోపాల కారణంగా అని తెలుస్తుంది.