Homeహైదరాబాద్latest NewsBREAKING: పండగ పూట వరంగల్ లో విషాదం..

BREAKING: పండగ పూట వరంగల్ లో విషాదం..

ఇదేనిజం, వరంగల్ తూర్పు: వరంగల్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి అయినా సంఘటన ఆదివారం కీర్తి నగర్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇటుకల మల్లేశం (45) ఆటో డ్రైవర్ గా ఎనుమాముల ఎన్టీఆర్ నగర్ కు చెందిన వ్యక్తి. ఆదివారం మధ్యాహ్నం కీర్తి నగర్ లో ప్రయాణికులను దించి తిరిగి ఇంటికి వెళుతుండగా రహదారి మధ్యలో ఉన్న మిషన్ భగీరథ మ్యాన్ హాల్లో ఆటో పడిపోవడంతో మల్లేశంకు తీవ్ర గాయాలయ్యాయి. మల్లేశం చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని ,మృతునికి భార్య స్వరూప మరియు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని పోలీసులు తెలిపారు. మిషన్ భగీరథ పైపులైన్ వేసి ఐదు నెలలైనా మ్యాన్ హాల్ పై కప్పు వేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని కాలనీవాసులు పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img