– బీజేపీ నుంచి మందకృష్ణ !
– కాంగ్రెస్ నుంచి సాంబయ్య
– రసవత్తరంగా మారనున్న ఎన్నిక
ఇదే నిజం, వరంగల్ ప్రతినిధి: వరంగల్ పార్లమెంటు బరిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయబోతున్నట్టు సమాచారం. ఇక బీజేపీ నుంచి మందకృష్ణ మాదిగ పోటీ చేస్తున్నారు. దీంతో ఈ ఎన్నిక రసవత్తరంగా మారనున్నది. మరికొన్ని రోజుల్లో లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నుంచి పోటీ చేసిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఓటమిని చవిచూశారు. దీంతో తాజాగా ఆయన వరంగల్ నుంచి పోటీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన ఇప్పటికే బీఎస్పీ అధినేత్రి మాయావతితోనూ సంప్రదింపులు జరపనున్నట్టు సమాచారం.
గెలుపే లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు వరంగల్ పార్లమెంటుపై దృష్టి సారిస్తున్నాయి. ఈ మేరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జిల్లా నేతలతో సమాలోచనలు జరిపి బీఎస్పీ అధినేత్రి మాయావతి దృష్టికి తీసుకుపోయినట్లు విశ్వసనీయ సమాచారం. బీఆర్ఎస్ నుంచి ఈ సారి ఆరూరి రమేశ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ దొమ్మాటి సాంబయ్యకు ఇచ్చే చాన్స్ ఉందని తెలుస్తోంది. ఇక వీరితోపాటూ ఓ సీనియర్ జర్నలిస్ట్ సైతం పోటీలో ఉండబోతున్నట్టు సమాచారం. దీంతో వరంగల్ పార్లమెంటు ఎన్నిక ఇంట్రెస్టింగ్ మారనున్నది. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, మందకృష్ణ మాదిగతో పాటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా బలమైన అభ్యర్థులను రంగంలోకి దించితే చతుర్ముఖ పోటీ జరిగే చాన్స్ ఉంది.