Summer Holidays: తెలంగాణలో భానుడి భగభగలు మొదలయ్యాయి. అధిక ఉష్ణోగ్రతలతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. స్కూళ్లకు వచ్చే నెల (ఏప్రిల్) 20 నుంచి వేసవి సెలవులు ప్రకటిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రాలు ఉన్న స్కూళ్లు మధ్యాహ్నం పూట క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది. ఈమేరకు పాఠశాలల్లో ఏర్పాట్లు చేసుకోవాలంటూ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసింది.