TDP shock to AP CM Jagan and lodged a complaint with the DGP. TDP senior leader and politburo member Varla Ramaiah wrote a letter to Gautam Sawang to this effect.
ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ షాకిచ్చింది.. ఆయనపై ఏకంగా డీజీపీకి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు గౌతమ్ సవాంగ్‌కు టీడీపీ సీనియర్ నేత, పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ రాశారు.
నెల్లూరులో ఈ నెల 11న జరిగిన అమ్మఒడి సభలో సీఎం జగన్ ఆలయాలపై దాడుల గురించి ప్రస్తావించారని.. ఈ దాడులు చేస్తున్నవారు తనకు తెలుసని అన్నారని గుర్తు చేశారు.
రథాలు తగులబెట్టిన వారే రథయాత్రలు చేస్తున్నారని.. డీజీపీ వెంటనే సీఎంకు నోటీసు ఇచ్చి.. ఆలయాలు ధ్వంసం చేసిందెవరో చెప్పించాలని కోరారు. వర్ల రామయ్య లేఖతో పాటు జగన్ ప్రసంగ వీడియోను కూడా పంపారు.
నెల్లూరులో ఈ నెల 11న అమ్మఒడి రెండో విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు.
అనంతరం జరిగిన సభలో సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వల్ల ప్రతిపక్షాలకు రాష్ట్రంలో చోటు లేకుండా పోతుంది కాబట్టే కడుపుమంటతో రాష్ట్రంలో అశాంతి సృష్టిస్తున్నాయని జగన్ ఆరోపించారు.
అర్ధరాత్రి ఎవరూ లేని ఆలయాల్లో విగ్రహాలు ధ్వంసం చేస్తున్నది ఎవరో ప్రజలే ఆలోచించాలని పిలుపునిచ్చారు.
రథాలు తగులబెట్టిన వారే రథయాత్రలు కూడా చేస్తున్నారని ఆరోపించారు.
ప్రజలకు మంచి చేసే ఏ కార్యక్రమం మొదలుపెట్టినా.. ఆ కార్యక్రమానికి ఒకటి రెండు రోజుల ముందు, తర్వాత గుళ్లు, గోపురాలను టార్గెట్ చేస్తున్నారన్నారు ముఖ్యమంత్రి.
ప్రభుత్వం చేసే మంచి ప్రజలు, ప్రపంచానికి తెలయకూడదన్న ఉద్దేశంతో ఇలా చేస్తున్నారన్నారు. దేవుడిపై భక్తి లేనివారు, పట్టపగలే గుళ్లను కూల్చేసిన వారు, ఆలయ భూములను కాజేసిన వారు, అమ్మవారి ఆలయంలో క్షుద్రపూజలు చేసిన వారు ఉన్నట్లుండి కొత్త వేషం కడుతున్నారని.. దేవుడిపై ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నారని.. ఇన్నాళ్లూ గుళ్లపై పడిన వారు రేపు బడులపై పడతారేమో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.