డ్రగ్స్ వినియోగ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నట్లు కనిపిస్తోంది. గంజాయి, డ్రగ్స్ సరఫరా చేయాలంటే భయపడేలా చర్యలుండాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. టీజీన్యాబ్ కోసం రాష్ట్రంలో నాలుగు పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్, వరంగల్ లో పోలీస్ స్టేషన్లు సిద్ధం అవుతున్నాయి. మరో 25 రోజుల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. అందుకోసం అవసరమైన సిబ్బందిని త్వరలో ఠాణాలకు ఆటాచ్‌చేస్తామని చెబుతున్నారు. డ్రగ్స్‌పై ఉక్కుపాదంమోపుతున్న పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా 2021 లో 1331 కేసులు నమోదుచేయగా 2వేల919 మందినిందితులని అరెస్ట్‌చేశారు. 95.5కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
ఈఏడాది ఇప్పటివరకు 669 కేసులు నమోదుచేయగా 1321 మందిని అరెస్ట్ చేసి 69.69కోట్ల విలువైన మత్తు పదార్ధాలు, విక్రేతల ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకి పట్టుబడిన డ్రగ్స్‌లో 16 కోట్ల 84లక్షల విలువైన గంజాయి, 3 కోట్ల 32లక్షల విలువైన ఓపియం, 48 కోట్ల విలువైన ఆల్పాజోలం సహా ఇతర మత్తుపదార్ధాలు ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.