Homeహైదరాబాద్latest Newsనాగ పంచమి పండుగ విశిష్టత.. పూజా విధానం.. పూజకు శుభముహూర్తం ఇదే!

నాగ పంచమి పండుగ విశిష్టత.. పూజా విధానం.. పూజకు శుభముహూర్తం ఇదే!

శ్రావణ మాసంలో వచ్చే నాగ పంచమి పండుగను శుక్ల పక్ష పంచమి తిథి నాడు జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీ శుక్రవారం ఈ పండను జరుపుకోనున్నారు. ఈ రోజున సర్ప దేవతను లేదా నాగతదేవతను పూజించడం వల్ల అన్ని సమస్యల నుంచి విముక్తి కలుగుతుందని నమ్ముతారు. మన దేశంలో ఈరోజున నాగ దేవతలకు పూజలు చేయడం శుభ ప్రదంగా భావిస్తారు. తమకు ఉన్న దోషాలు తొలగిపోయి సంతోషంగా ఉంటామని భావిస్తుంటారు.

నాగ పంచమి రోజు పూజకు శుభముహూర్తం ఇదే!
నాగ దేవతను ప్రసన్నం చేసుకునేందుకు నిర్వహించుకునే పండుగ నాగ పంచమి. ఈ ఏడాది ఆగస్టు 9, శుక్రవారం రోజున జరుపుకోనున్నారు.నాగ పంచమి తిథి ఆగష్టు 9 శుక్రవారం తెల్లవారుజామున 12:36 గంటలకు ప్రారంభమై, ఆగష్టు 10 తెల్లవారుజామున 3:14 గంటలకు ముగుస్తుంది. పూజా ముహూర్తం శుక్రవారం ఉదయం 5:47 నుండి 8:27 వరకు ఉంటుంది. ఆచారాలను నిర్వహించడానికి మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాల వ్యవధి ఉంది.

నాగ పంచమి పూజా విధానం
నాగ పంచమి రోజున పుట్ట దగ్గరికి వెళ్లి నాగదేవతకు పూజలు నిర్వహించాలి. గుడి సమీపంలో పుట్ట ఉంటే అక్కడికి వెళ్లి పుట్టలో పాలు పోసి పూజించాలి. పాముకి పాలు నైవేద్యంగా సమర్పించాలి. అలాగే దూర్వ, దహి, గంధ అక్షత, పుష్పాలు కూడా సమర్పించాలి. నాగ పంచమి రోజున ఉపవాసం పాటించి నమోస్తు సర్పేభ్యో యే కే చ పృథ్వీ మను యే అంతరికే యే దివి తేభ్య: సర్పే భ్యో నమ: మంత్రాన్ని పఠించడం వల్ల కాలసర్ప దోషం తొలగిపోతుంది.

Recent

- Advertisment -spot_img