Homeహైదరాబాద్latest News'రాష్ట్రంలో కొన్ని జిల్లాలను రద్దు చేస్తాం' : మంత్రి తుమ్మల

‘రాష్ట్రంలో కొన్ని జిల్లాలను రద్దు చేస్తాం’ : మంత్రి తుమ్మల

తెలంగాణలో జిల్లాల రద్దు వివాదంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన జిల్లాల విభజన శాస్త్రీయంగా లేదని, ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి తగిన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ‘కేసీఆర్ ఎక్కడికి వెళ్లినా జిల్లాలను రద్దు చేస్తారు.. అని ప్రచారం చేస్తున్నారు. అన్ని జిల్లాలను రద్దు చేస్తే పాలన సాగుతుందా?’ అని ప్రశ్నించారు. మహబూబాబాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్‌కు మద్దతుగా నిర్వహించిన సభలో పాల్గొని ఆయన మాట్లాడారు.

మంత్రి వ్యాఖ్యలను నిశితంగా పరిశీలిస్తే అన్ని రాష్ట్రంలో అనవసరంగా ఏర్పాటు చేసిన కొన్ని జిల్లాలను రద్దు చేసి పాత్ జిల్లాల్లో కలపనున్నట్లు తెలుస్తోంది. వరంగల్ జిల్లాను 6 జిల్లాలుగా విడగొట్టడంపై అక్కడి ప్రజలు కొంత అసహనంతో ఉన్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న వరంగల్ జిల్లాను ప్రజల నుంచి డిమాండ్ లేకుండానే అడ్డగోలుగా విడగొట్టారనే ఆరోపణలు గత ప్రభుత్వంపై ఉన్నాయి. ఇటువంటి సంఘటనలను దృష్టిలో ఉంచుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీఆర్‌ఎస్ నిర్ణయాలను ఒక్కొక్కటిగా రద్దు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రతిపక్షం మీద ప్రతీకారం, కోపంతో తీసుకొనే నిర్ణయాలు ప్రజలకు చేటు చేసే అవకాశం లేకపోలేదు. ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన గ్యారంటీలను ముందుగా నెరవేర్చాలని ప్రజలు కోరుతున్నారు. రుణమాఫీ, మహిళలకు నెలకు రూ. 2500, ఉచిత స్కూటీ, యువతకు ఆర్థిక సాయం తదితర హామీల అమలుపై సర్కారు దృష్టి సారించాలని రాజకీయ విశ్లేషకులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Recent

- Advertisment -spot_img