Homeహైదరాబాద్latest Newsనేటి రాశి ఫలాలు (09-11-2024, శనివారం)

నేటి రాశి ఫలాలు (09-11-2024, శనివారం)

మేషం
మీకు మ‌థ్య‌స్థ ఫ‌లితాలు ఉన్నాయి. ఆదాయం మంచిగా ఉన్న‌ప్ప‌టికీ ఖ‌ర్చుల వ‌ల్ల కాస్త ఇబ్బందిప‌డి ఉండాల్సిన ఉంది. వాహ‌నాలు మార్పులు చేసే అవ‌కాశం ఉంది. గృహ సంబంధిత నూత‌న వ‌స్తువులు కొనుగోలు చేస్తారు. స్వంత వృత్తుల వారికి మంచి ఫ‌లితాలు ఉన్నాయి.

వృష‌భం
నేటి రాశి ఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఈరోజు అనుకూల స‌మ‌యం కాదు. ప‌ని ఒత్తిళ్లు ఒకింత త‌గ్గును. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. కాంట్రాక్టు వ్యాపార‌స్తుల‌కు న‌ష్ట‌ము వాటిల్లే ప్ర‌మాదం ఉంది. దూర ప్ర‌యాణాలు అనుకూలించే అవ‌కాశం ఉంది.

మిథునం
అనుకూల స‌మ‌యం కాదు. ఆదాయానికి మించిన వ్య‌యం ఉంటుంది. విద్యార్థులు అన్ని విధాలుగా విజ‌యం సాధిస్తారు. బంధువుల‌తో సంతోషంగా గ‌డుపుతారు. దైవ సంద‌ర్శ‌నం శుభ ప్ర‌దం. కొన్ని కీల‌క ప‌నులు అనుకున్న స‌మ‌యానికి పూర్తి చేస్తారు.

క‌ర్కాట‌కం
అనుకున్నంత అనుకూల‌మైన స‌మ‌యం కాదు. ఆరోగ్య‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు ఎదురు కావ‌చ్చు. కొంత‌కాలంగా ఇబ్బందిపెడుతున్న స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. ధ‌న‌లాభం. భోజ‌న సౌఖ్యం. ఆగిపోయిన ప‌నులు పూర్త‌వుతాయి. దూర ప్ర‌యాణాలు క‌లిసి వ‌స్తాయి.

సింహం
మ‌థ్య‌స్థ ఫ‌లితాలు ఉన్నాయి. ఒత్తిడి త‌గ్గుతుంది. విద్యార్థులు క‌ష్ట‌ప‌డాల్సిన స‌మ‌యం. మిత్రుల‌తో సాన్నిహిత్యం పెరుగుతుంది. దైవ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. పూజాది కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు.

క‌న్య‌
అనుకూల‌మైన స‌మ‌యం కాదు. ఆరోగ్యం మంచిగా ఉంటుంది. విహార యాత్ర‌లు చేస్తారు. కొన్ని బాధ్య‌త‌లు తీసుకోవాల్సి ఉంటుంది. నిరుద్యోగుల‌కు అనుకూల స‌మ‌యం. ధ‌న‌వ్య‌యం వ‌ల్ల కాస్త ఇబ్బందులు ఎదుర‌వుతాయి.

తుల‌
మ‌ధ్యస్థ ఫ‌లితాలు ఉంటాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. శుభ కార్యాలు క‌లిసి వ‌స్తాయి. ఉద్యోగంలో ప‌ద‌వీ యోగం ఉంది. స‌న్నిహితుల‌తో సంతోషంగా గ‌డుపుతారు. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు.

వృశ్చికం
మ‌ధ్యస్థ ఫ‌లితాలు ఉంటాయి. వ్యాధుల తీవ్ర‌త త‌గ్గును. శుభ కార్యాలు క‌లిసి వ‌స్తాయి. ఉద్యోగంలో ఉన్న‌త ప‌ద‌వులు సూచితం. ఆత్మీయుల‌తో సంతోషంగా గ‌డిపుతారు.

ధ‌నుస్సు
అనుకూల స‌మ‌యం కాదు. ఆరోగ్య‌ప‌రంగా కాస్త ఇబ్బందులు ఏర్ప‌డ‌తాయి. జాగ్ర‌త్త‌లు వహిస్తే వాటి నుంచి బ‌య‌ట ప‌డొచ్చు. ధ‌న‌వ్య‌య‌ము. దైవ ద‌ర్శ‌న‌ముల్లో పాల్గొంటారు. దూర ప్ర‌యాణాలు చేస్తారు. కొన్ని అనుకూల ఖ‌ర్చులు ఉన్నాయి. స్వ‌ల్ప చికాకులు ఏర్ప‌డును.

మ‌క‌రం
అనుకూల స‌మ‌యం. ఆరోగ్యం క‌లిసి వ‌స్తుంది. దూర ప్ర‌యాణాల వ‌ల్ల అల‌స‌ట‌గా ఉంటుంది. ధ‌న‌ప్రాప్తి సూచితం. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆనందంగా గ‌డుపుతారు.

కుంభం
స‌మాజంలో కీర్తి ప్ర‌తిష్ఠ‌లు పెరుగుతాయి. ఉద్యోగంలో పద‌వీ యోగం ఉంది. అంత‌టా సంతోషంగా కాలాన్ని ఆస్వాదిస్తారు. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. మాన‌సిక ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది.

మీనం
నేటి రాశి ఫలాల ప్రకారం మీన రాశి వారికి ఇది అనుకూల స‌మ‌యం. ఆరోగ్యం విష‌యంలో త‌గిన జాగ్ర‌త్త‌లు అవ‌స‌రం. ఆత్మీయుల‌తో ఆనందంగా గ‌డుపుతారు. కుటుంబ స‌భ్యుల‌తో ఎన్నో విష‌యాలు పంచుకుంటారు. ఇబ్బందులు తొలగుతాయి. ఉద్యోగంలో విజ‌యాన్ని అందుకుంటారు.

Recent

- Advertisment -spot_img