Homeహైదరాబాద్latest Newsనేటి రాశి ఫలాలు (17-04-2024)

నేటి రాశి ఫలాలు (17-04-2024)

మేష రాశి
ఈ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఓర్పుతో కొన్ని సమస్యలను పరిష్మరించుకుంటారు. దూరపు బంధువుల సలహాలు పాటించి ముందడుగు వేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలలో నూతన ఉత్సాహం. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయ నాయకులకు విదేశీ పర్యటనలు ఉంటాయి. మరింత శుభఫలితాల కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. వేంకటేశ్వరస్వామిని పూజించడం వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం, చదవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి
ఈ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థులకు కొత్త అవకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. వాహన, కుటుంబ సౌఖ్యం. అంచనాలు నిజమవుతాయి. రాబడి పెరుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో అడుగు ముందుకువస్తారు. ఉద్యోగులకు ఉన్నతస్థితి. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

మిథున రాశి
ఈ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్తముగా ఉంది. స్నేహితులు, సన్నిహితులతో ఆనందముగా గడుపుతారు. మీ సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు సానుకూలం. వ్యాపారాలు అభివృద్ధి పథంలో సాగుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. రాజకీయ వర్గాలకు సన్మానాలు. అనారోగ్య సమస్యలుండును. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.

కర్కాటక రాశి
ఈ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఆలయాలు సందర్శిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. శుభకార్యాల రీత్యా ఖర్చులు. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగులకు ఆశలు చిగురిస్తాయి. కళాకారుల ప్రయత్నాలు సఫలం. ఆకస్మిక ప్రయాణాలు. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహాలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

సింహ రాశి
ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఆదాయం మరింత పెరిగే అవకాశం. కొత్త విద్యావకాశాలు పొందుతారు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ప్రయాణాల్లో నూతన పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అభివృద్ధిదాయకంగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. రాజకీయ నాయకులకు పదవీయోగాలు. మానసిక ఆందోళన. చర్చలు విఫలమవుతాయి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. వేంకటేశ్వరస్వామిని పూజించడం వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం, చదవడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.

కన్యా రాశి
ఈ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఇంటర్వ్యూలు అందుకుంటారు. మీ కృషి ఫలించే సమయం. జీవిత భాగస్వామితో తగాదాలు తీరతాయి. కాంట్రాక్టర్లకు అనుకూల సమయం. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు. కళాకారులకు ఊహించని అవకాశాలు. ధనవ్యయం. కుటుంబ సభ్యుల నుంచి సమస్యలు. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

తులా రాశి
ఈ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. చేపట్టి పనులలో కొంత జాప్యం జరుగుతుంది. రాబడికి మించిన ఖర్చులుంటాయి. కుటుంబ సభ్యులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.

వృశ్చిక రాశి
ఈ రాశి వారికి నేటి దిన ఫలాలు అనుకూలం. కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఆదాయం మరింత పెరుగుతుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. నిర్ణయాలలో మాత్రం కొంత నిదానం అవసరం. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. స్నేహితుల నుంచి ఒత్తిడులు. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహాలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

ధనూ రాశి
ఈ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థం నుండి అనుకూలం. అదనపు ఆదాయం సమకూరుతుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. మీ అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. తీర్థ యాత్రలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి. అనుకోని ప్రయాణాలు. వేంకటేశ్వరస్వామిని పూజించడం వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం, చదవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మకర రాశి
ఈ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. కొన్ని వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటిలో శుభకార్యాల నిర్వహణ. విలువైన వస్తువులు కొంటారు. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. అనుకున్నది పట్టుదలతో సాధిస్తారు. వేడుకల్లో చురుగ్గా పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు దక్కవచ్చు. ప్రయాణాలు వాయిదా. శ్రమ తప్పదు. ఆరోగ్య సమస్యలుంటాయి. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

కుంభ రాశి
ఈ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. ఆదాయం పెరిగి అవసరాలు తీరతాయి. పనులు చకాచకా పూర్తిచేస్తారు. నిరుద్యోగులకు అంచనాలు నిజమవుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచమవుతారు. వాహనాలు, ఆస్తులు కొంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. కళాకారులకు సన్మానాలు. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.

మీన రాశి
ఈ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. రుణబాధలు కాస్త తీరతాయి. భవిష్యత్తుపై నిరుద్యోగులకు కొత్త ఆశలు. స్నేహితుల నుంచి అందిన సమాచారంతో ఊరట. ఆరోగ్య సమస్యలు కొంత వేధిస్తాయి. వ్యాపారాలలో ఒత్తిడులు అధిగమిస్తారు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. కళాకారులకు మిశ్రమల ఫలితాలుంటాయి. అనారోగ్య సూచనలున్నాయి. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

Recent

- Advertisment -spot_img