ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో కొత్త ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ 2024 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుందని ఇప్పటికే వార్తలు వినిపించాయి. అయితే, తాజాగా ఈ సినిమాలోని నటించబోయే హీరోయిన్‌కు ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. బాలీవుడ్ క్రేజీ బ్యూటీ దీపికా పదుకొనేను హీరోయిన్గా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీపికా బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా కొనసాగుతోంది. పాన్ ఇండియా మూవీ ‘కల్కి’లో రెబల్ స్టార్ ప్రభాస్ సరసన నటిస్తున్న దీపిక.. బన్సీ–త్రివిక్రమ్ మూవీలో యాక్ట్ చేస్తే ఇది ఆమె రెండో తెలుగు సినిమా అవుతుంది. బన్నీ సరసన దీపిక పదుకొనే స్టెప్స్ వేస్తే అదిరిపోతుందని అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంబురపడిపోతున్నారు. ఈ మూవీలో సెకండ్ హీరోయిన్గా పూజా హెగ్డేని తీసుకోబోతున్నట్లు సమాచారం.