HomeసినిమాTollywood : OG నుంచి అప్​డేట్స్ లేనట్లేనా..

Tollywood : OG నుంచి అప్​డేట్స్ లేనట్లేనా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమా షూటింగ్​లకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పవన్​ కల్యాణ్ ప్రస్తుతం.. క్రిష్ డైరెక్షన్​లో హరిహర వీరమల్లు, హరీశ్​ శంకర్ తీస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’, యంగ్​ అండ్ టాలెంటెడ్ డైరక్టర్ సుజిత్ తీస్తున్న ‘ఓజీ’.. ఈ మూడు సినిమల్లో నటిస్తున్న సంగతి తెలిసిదే. అయితే, ఓజీ సినిమా అప్​డేట్స్ కోసం పవన్​ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను నిర్మిస్తున్న డీవీవీ ఎంటర్​టైన్​మెంట్స్ సైతం ఎప్పటికప్పుడు అప్​డేట్స్​ను ఇస్తూ వస్తోంది. తాజాగా డీవీవీ ఎంటర్​టైన్​మెంట్స్ నుంచి వచ్చిన ఓ ట్వీట్ పవన్​ ఫ్యాన్స్​కు నిరాశకు గురిచేసింది. ‘ఫ్యాన్ ఎప్పుడు కూడా ఆకలిగానే ఉంటారు. వారికి ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇప్పుడు తాము ఎలాంటి షూటింగ్ చేయడం లేదు. అందుకే ఇప్పట్లో అప్​డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే సోషల్ మీడియాలో అప్​డేట్స్ కోసం ఎవరు ఆశించవద్దు’ అని ఒక క్లియర్ స్టేట్​మెంట్​ను ఇచ్చేశారు. పవన్ ఫ్యాన్స్ ఈ సినిమా విషయంలో కొన్నాళ్ల పాటు ఎలాంటి అప్​డేట్స్​ను ఆశించడానికి లేదని చెప్పాలి.

Recent

- Advertisment -spot_img