Homeహైదరాబాద్latest Newsత్రిముఖ పోరులో వేడెక్కిన చేవెళ్ల.. ఇంఛార్జిగా CM రేవంత్

త్రిముఖ పోరులో వేడెక్కిన చేవెళ్ల.. ఇంఛార్జిగా CM రేవంత్

– మోడీ వేవ్​పై బీజేపీ ఆశలు
– గెలుపు ఊపులో హస్తం పార్టీ
– నాలుగు సెగ్మెంట్లలో బీఆర్ఎస్​ విజయం
– చేవెళ్ల ఇన్​ చార్జ్​ ముఖ్యమంత్రి రేవంత్​
– సీఎం అయ్యాక ఫస్ట్​ టాస్క్​
– సర్వశక్తులు ఒడ్డనున్న ముఖ్యమంత్రి
– హాట్​ సీట్​ లో మూడు పార్టీల హోరాహోరీ

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: చేవెళ్ల నియోజకవర్గంపై ఇప్పుడు రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్​, బీజేపీ, కాంగ్రెస్​ ఫోకస్​ పెట్టాయి. బీజేపీ మోడీ వేవ్​ ను నమ్ముకున్నది. ఇక ఇటీవల అధికారంలో రావడంతో కాంగ్రెస్​ పార్టీ సైతం గెలుపు ఊపు మీద ఉన్నది. మరోవైపు ఈ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ ఇన్​ చార్జ్​ కావడంతో ఆయన ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకోనున్నారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్​ నాలుగు అసెంబ్లీ స్థానాలు గెలిచింది. ఈ నియోజకవర్గం సెమీ అర్బన్​ కావడం తమకు కలిసొస్తుందని బీఆర్ఎస్​ లెక్కలు వేసుకుంటున్నది. దీంతో చేవెళ్ల మీద ఫుల్​ ఫోకస్​ ఏర్పడింది. చేవెళ్ల నియోజకవర్గంలో 20 లక్షల ఓట్లు ఉన్నాయి. మహేశ్వరం, శేరిలింగంపల్లి, చేవెళ్ల, పరిగి, వికారాబాద్​, తాండూర్​, రాజేంద్రనగర్​ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో మహేశ్వరం, శేరిలింగంపల్లి, చేవెళ్ల, రాజేంద్రనగర్​ బీఆర్ఎస్​ గెలుచుకోగా.. పరిగి, వికారాబాద్​, తాండూర్​లో కాంగ్రెస్​ విజయం సాధించింది. మహేశ్వరం, శేరిలింగంపల్లిలో బీజేపీ సెకండ్​ ప్లేస్​ లో ఉంది.

ఇది కూడా చదవండి: ఆడవారికి బిగ్ షాక్.. ఇక ఫ్రీ బస్సు ప్రయాణం కష్టమేనా..?

నియోజకవర్గ గత చరిత్ర ఇదీ..
2009లో ఇక్కడ సూదిని జైపాల్​ రెడ్డి విజయం సాధించారు. 2014లో కొండా విశ్వేశ్వర్​రెడ్డి విజయం సాధించారు. 2019లో రంజిత్​ రెడ్డి విజయం సాధించారు. 2014లో బీఆర్ఎస్​ అభ్యర్థిగా పోటీచేసిన కొండా విశ్వేశ్వర్​ రెడ్డి.. 2019లో కాంగ్రెస్​ తరఫున పోటీ చేసి కేవలం 14వేల స్వల్ప తేడాతో ఓడిపోయారు. ప్రస్తుతం కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ తరఫున బరిలో నిలిచే చాన్స్​ ఉంది. 2014లో ఆయన గెలుపొందడం.. 2019లో స్వల్ప తేడాతో ఓడిపోవడం ఆయనకు కలిసివచ్చే అంశం.. సెమీ అర్బన్​ సెగ్మెంట్ కావడంతో మోడీ వేవ్, అయోధ్య అంశాలు కలిసి వస్తాయేమోనని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: రూ.400తో అయోధ్యకు ఈజీగా వెళ్లండి.. ఇలా

ఇక ఇప్పుడు బీఆర్ఎస్​ అభ్యర్థిగా మరోసారి రంజిత్​ రెడ్డి పోటీ చేసే చాన్స్​ ఉంది. కాంగ్రెస్​ టికెట్​ ఎవరికి ఇస్తారన్నది క్లారిటీ లేదు. కానీ కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డికి టికెట్​ వస్తుందని కాంగ్రెస్​ వర్గాలు చెబుతున్ఆనయి. మరోవైపు ఈ పార్లమెంటు సెగ్మెంట్ కు రేవంత్​ రెడ్డి ఇన్​ చార్జ్​గా ఉన్నారు. ఇక కేఎల్​ఆర్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే పార్లమెంటు పరిధిలోని మహేశ్వరం సెగ్మెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు చేవెళ్ల పార్లమెంటు పరిధిలో పరిచయాలు ఎక్కువగా ఉన్నాయి. చేవెళ్ల పార్లమెంటు బరిలో ఉండబోతున్న రంజిత్​ రెడ్డి, కొండా విశ్వేశ్వర్​ రెడ్డి ఆర్థికంగా ఎంతో బలమైన నేతలు. కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి కూడా ఆర్థికంగా బలమైన నేతే. దీంతో ఇక్కడ పోటీ రసవత్తరంగా సాగే చాన్స్​ ఉంది. కాంగ్రెస్​ పార్టీలో ఈ సీటు కోసం ముగ్గురు, నలుగురు పోటీ పడుతున్నప్పటికీ లక్ష్మారెడ్డికే టికెట్​ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: రుణమాఫీపై తెలంగాణ గవర్నమెంట్ గుడ్ న్యూస్

సీఎంకు ఎంతో ప్రతిష్ఠాత్మకం
ఈ నియోజకవర్గం సీఎం రేవంత్​ రెడ్డికి ఎంతో ప్రతిష్ఠాత్మకం. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఇదే తొలి టాస్క్​. కనక రేవంత్​ రెడ్డి ఇక్కడ సర్వ శక్తులు ఒడ్డే అవకాశం ఉంది. పైగా కాంగ్రెస్​ పార్టీ ప్రస్తుతం రాష్ట్రంలో పవర్​ లో ఉంది కనక ఆ పార్టీకి ఈ ఎన్నికల కలిసొచ్చే అవకాశం ఉంది. ఇక కొండా విశ్వేశ్వర్​ రెడ్డి గతంలో ఓ సారి గెలుపొందారు. ఈ సారి మోడీ వేవ్​ కలిసి వస్తుందని చూస్తున్నారు. ఇక బీఆర్ఎస్​ అభ్యర్థి రంజిత్​ రెడ్డి వివాద రహితుడు. అంతేకాక అర్బన్​ లో బీఆర్ఎస్​ పార్టీ ఇంకా బలంగా ఉండటం ఆయనకు కలిసివచ్చే అవకాశం. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనైనా ఏ పార్టీ బలంగా ఉందంటే కచ్చితంగా చెప్పొచ్చు. కానీ చేవెళ్లపై అలా చెప్పేందుకు చాన్స్​ లేదు. ఇక్కడ అన్ని పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ నియోజకవర్గం రాష్ట్రంలో హాట్ సీటుగా మారే చాన్స్​ ఉంది. మరి ఎవరు గెలుస్తారో వేచి చూడాలి.

Recent

- Advertisment -spot_img