హైదరాబాద్లో నేటి నుంచి 39 మంది ట్రాన్స్ జెండర్లు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహించనున్నారు. తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన వీరికి 15 రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులు ట్రైనింగ్ ఇచ్చారు. డ్యూటీలో క్రమశిక్షణ, పనితీరుపై వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. సీఎం రేవంత్ తీసుకున్న ఈ విప్లవాత్మక నిర్ణయంతో సమాజంలో ట్రాన్స్ జెండర్ల పట్ల చిన్న చూపు పోతుందని స్పష్టం చేశారు.