Homeఫ్లాష్ ఫ్లాష్కీలక నిర్ణయాలపై బైడెన్‌ తొలి సంతకం

కీలక నిర్ణయాలపై బైడెన్‌ తొలి సంతకం

వాషింగ్టన్‌: అమెరికా 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్వేతసౌధంలోకి వెళ్లిన జో బైడెన్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

గత అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలను వెనక్కి తీసుకున్నారు. ఈ మేరకు జో బైడెన్‌ అధ్యక్షుడి హోదాలో సంతకం చేశారు.

డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న కీలక నిర్ణయాలపై బైడెన్‌ ఎన్నికల్లో చెప్పినట్టు వాటిని వెనక్కి తీసుకున్నారు. ఈ విధంగా 15 కీలక కార్యనిర్వాహక ఆదేశాలపై బైడెన్‌ సంతకాలు చేశారు.

అమెరికా ప్రజలకు మేలు చేస్తూనే.. ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు పెంచుకునేలా బైడెన్‌ తీరు కనిపిస్తోంది.

బైడెన్‌ తీసుకున్న నిర్ణయాల్లో కీలకమైనవి ఇవే..

* కోవిడ్‌-19 రెస్పాన్స్‌ కో ఆర్డినేటర్‌ పదవిని సృష్టిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వంద రోజుల పాటు మాస్క్‌లు, భౌతిక దూరం పాటించాలని బైడెన్‌ పిలుపునిచ్చారు.

* ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నుంచి వైదొలగడాన్ని విరమించుకున్నారు.

* అమెరికా- పారిస్‌ వాతావరణ ఒప్పందంలో బైడెన్‌ నిర్ణయంతో అమెరికా మళ్లీ చేరింది.

* మెక్సికో గోడ నిర్మాణంపై బైడెన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. గోడ నిర్మాణానికి నిధుల సమీకరణకు తీసుకొచ్చిన నేషనల్‌ ఎమర్జెన్సీ డిక్లరేషన్‌ను నిలిపివేశారు.

* గ్రీన్‌ కార్డు జారీలో దేశాలకు పరిమితిని బైడెన్‌ ఎత్తేశారు. ఈ నిర్ణయంతో భారతదేశంతో పాటు ఎన్నో దేశాల వారికి ఉపశమనం కలగనుంది.

* అమెరికా అభివృద్ధిలో కీలకంగా ఉన్న వలసదారులకు శాశ్వత పౌరసత్వం, నివాసం కల్పిస్తూ బైడెన్‌ నిర్ణయం తీసుకున్నారు.

Recent

- Advertisment -spot_img