Homeహైదరాబాద్latest News'మా పౌరులను రక్షించుకుంటాం' : కెనడా ప్రధాని

‘మా పౌరులను రక్షించుకుంటాం’ : కెనడా ప్రధాని

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ హత్య తర్వాత కెనడాలోని ఓ వర్గం అభద్రతాభావంతో జీవిస్తోందని కెనడా ప్రధాని ట్రూడో అభిప్రాయపడ్డారు. నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు వ్యవహారంపై కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో స్పందించారు. కెనడాలో చట్టబద్ధమైన పాలన, స్వతంత్ర, బలమైన న్యాయవ్యవస్థ ఉందన్నారు. తమ పౌరులను రక్షించడమే ప్రభుత్వ కర్తవ్యమని వ్యాఖ్యానించారు. హర్దీప్‌సింగ్‌ హత్య కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని ఆయన తెలిపారు. కెనడాలో ఉన్న ప్రతి వ్యక్తికీ భద్రతతో జీవించే హక్కు ఉందని చెప్పారు. వివక్షాపూరిత, హింసాయుత వాతావరణం నుంచి రక్షణ పొందే హక్కు వారికి ఉంది అని వ్యాఖ్యానించారు. 

తాజాగా ఈ విషయంపై భారత విదేశాంగ మంత్రి ఎస్​ జై శంకర్​ స్పందించారు. కెనడా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు భారతీయుల సమాచారం కోసం కేంద్ర ప్రభుత్వం వేచి చూస్తుందని జైశంకర్‌ తెలిపారు. అరెస్టుల వార్తలను తాను చూశానని చెప్పారు. వారు భారత్‌ నుంచి, ప్రత్యేకంగా పంజాబ్ నుంచి, కెనడాలో వ్యవస్థీకృత నేర కార్యకలాపాలు నిర్వహించారన్న సమాచారం ఉందా అని జై శంకర్ ప్రశ్నించారు. 

Recent

- Advertisment -spot_img