రామమందిరంపై రాజకీయాలు చేయడం సరికాదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు.
బీఆర్ఎస్ పై వ్యతిరేకతతోనే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. మూడో సారి మోడీ ప్రధాని కావాలనేదే ప్రజల ఆకాంక్ష అని.. ప్రజలు మరో బీజేపీ పట్టం కడతారని చెప్పారు. తెలంగాణలో 10 నుంచి 12 పార్లమెంట్ స్థానాలు గెలిస్తామని అన్నారు.