Homeహైదరాబాద్latest Newsసూపర్ మార్కెట్‌లో పండ్లపై స్టిక్కర్లు ఎందుకు వేస్తారు? వాటి అర్థం ఏంటో మీకు తెలుసా..?

సూపర్ మార్కెట్‌లో పండ్లపై స్టిక్కర్లు ఎందుకు వేస్తారు? వాటి అర్థం ఏంటో మీకు తెలుసా..?

సూపర్ మార్కెట్లు మరియు సాధారణ దుకాణాలు పండ్లపై స్టిక్కర్లను కలిగి ఉండడం మనం గమనిస్తుంటాం.. అయితే స్టిక్కర్ ఉన్న పండ్లు నాణ్యత పరంగా మంచివని మనం భావిస్తాం.. స్టిక్కర్‌తో కూడిన పండ్ల ధర కొన్నిసార్లు ఎక్కువగా ఉండటానికి కూడా ఇందుకో కారణం చెప్పొచ్చు. అయితే ప్రతి స్టిక్కర్‌కు ఒక కారణం ఉంటుందని మీకు తెలుసా?.. కాబట్టి మార్కెట్ నుంచి స్టిక్కర్లు ఉన్న పండ్లను కొనుగోలు చేసే ముందు.. స్టిక్కర్ అంటే ఏమిటో తెలుసుకోండి. అప్పుడు వాటిని కొనుగోలు చేయాలా వద్దా అని మీరే నిర్ణయించుకోండి..

  1. పండుపై ఉన్న స్టిక్కర్‌పై 4 అంకెల కోడ్ ఉంటే.. 3 లేదా 4తో ప్రారంభించి ఉంటె.. కృత్రిమ ఎరువులు, పురుగుమందులు ఉపయోగించి పండించినట్లు అర్థం చేసుకోవాలి.
  2. ఈ స్టిక్కర్‌పై 8 నంబర్‌తో మొదలయ్యే 5 అంకెల కోడ్ ఉంటే.. అది జన్యుపరంగా మార్పు చెందినదిగా గుర్తించాలి. వీటిని తింటే శరీరంలోని జన్యువులు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. వీటిని పిల్లలకు దూరంగా ఉంచండి.
  3. పండు స్టిక్కర్‌ పై 9తో మొదలై.. 5 అంకెల కోడ్ ఉంటే.. అది పూర్తిగా ఆర్గానిక్ ప్రక్రియ అని అర్థం చేసుకోవాలి. ఇందులో ఎలాంటి పురుగుమందులు, రసాయన ఎరువులు ఉండవు. ఇది అత్యంత సురక్షితమైనదని అర్ధం చేసుకోవాలి.
    అయితే చాలా సందర్భాల్లో కొందరు ఈ స్టిక్కర్లను మార్చే అవకాశం ఉంది. అందుకే మంచి గుర్తింపు ఉన్న పండ్ల ను సూపర్ మార్కెట్లు కొనడం ఉత్తమం.

Recent

- Advertisment -spot_img