Homeహైదరాబాద్latest Newsకాగజ్ నగర్: వీగనుందా? నెగ్గనుందా?

కాగజ్ నగర్: వీగనుందా? నెగ్గనుందా?

  • నేడే కాగజ్ నగర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మనుపై అవిశ్వాసం
  • సర్వత్రా చర్చ

ఇదే నిజం, కాగజ్‌నగర్‌: కాగజ్‌నగర్‌ మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్, వైస్ చైర్మన్ రాచకొండ గిరీష్ కుమార్ పై బీఆర్ఎస్ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం నెగ్గనుందా? లేక బెల్లంపల్లి బల్దియా లాగే వీగనుందా? అని పట్టణవాసులు, రాజకీయ నాయకులలో ఉత్సుకత నెలకొంది.

ఇది కూడా చదవండి: ఆడవారికి బిగ్ షాక్.. ఇకపై ఫ్రీ బస్సు ప్రయాణ సౌకర్యం కష్టమేనా..

కాగజ్‌నగర్‌ బల్దియాలో మొత్తం 30 మంది కౌన్సిలర్లు, ఎక్స్ అఫీషియో సభ్యుడు ఎమ్మెల్యే హరీశాబాబుతో కలిసి 31 మంది ఉన్నారు. అవిశ్వాసానికి (కోరం) కింద 21 మంది ఉంటే నెగ్గే అవకాశం ఉంది. లేకుంటే వీగిపోనుంది. అందులో ఒక్కరు కూడా తగ్గితే వీగిపోతుంది. తన హయాంలో మున్సిపాలిటీని కూడా అభివృద్ధి చేయని చైర్మన్ నిరంకుశ వైఖరితో విసిగిపోయామని తిరుగుబాటు చేసిన పౌరసరఫరాల సంఘం సభ్యులు సంతకం చేసిన నోటీసులో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: జస్ట్ రూ.400తో అయోధ్యకు వెళ్లొచ్చు.. ఇలా..

సద్దాం హుస్సేన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి చాలా కారణాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు.మున్సిపాలిటీని అభివృద్ధి చేయని, నిరంకుశంగా వ్యవహారిస్తున్నందున సభ్యులు అవిశ్వాస తీర్మానం పెట్టారు. అవిశ్వాసం పెట్టడానికి చాలా కారణాలు ఉన్నాయని చైర్మన్ సద్దాం తెలిపారు. అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ఇరు వర్గీయులు పోటాపోటీగా శిబిరాలు నిర్వహించడం, కౌన్సిలర్లకు డబ్బుల ఆశలు చూపడంతో కోరం కౌన్సిలర్లు ఎటు వైపు మొగ్గుచూపుతారో శనివారం వరకు వేచి చూడాల్సిందే.

ఇది కూడా చదవండి: తెలంగాణలో ఘోర బస్సు ప్రమాదం..

Recent

- Advertisment -spot_img