HomeతెలంగాణYS Sharmila:కాంగ్రెస్ లోకి షర్మిల వద్దట ! మర్మమేంటో?

YS Sharmila:కాంగ్రెస్ లోకి షర్మిల వద్దట ! మర్మమేంటో?

YS Sharmila:కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వైఏస్ షర్మిల(YS sharmila) దాదాపు సిధ్దమైంది . కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shivakumar) ఈ విషయంలో చక్రం తిప్పుతున్నారు . ఐతే కాంగ్రెస్ సీనియర్లు షర్మిలను పార్టీలో చేర్చుకునేందుకు ససేమిరా అంటున్నారు . ఈమె రావడం కాంగ్రెస్ కు నష్టం జరుగుతుందని చెబుతున్నారు . తెలంగాణాలో సీమాంధ్ర పెత్తనం అంటూ ఆరోపణలు వస్తాయని, కాంగ్రెస్ తెలంగాణాలో ఆంధ్ర వారిని ఆహ్వానిస్తున్నారని విమర్శలు ఎదుర్కోవలిసి వస్తుందని సీనియర్స్ అధిష్ఠానం దృష్టికి తెచ్చినట్లు తెలిసింది . తెలంగాణాలో పోలీసులపై వైఏస్ షర్మిల చేయి చేసుకోవడం , తెలంగాణ లో ఉన్న ప్రజా ప్రతినిధులను , నేతలను దూషించడం వంటి చర్యలు తెలంగాణ ప్రజలు జీర్ణించుకోవడం లేదని వివరించినట్లు సమాచారం. షర్మిల పార్టీలో చేరితే లాభం మాట దేవుడెరుగు ..పార్టీ గెలుపుపై ప్రభావం చూపెట్టి గెలిచే స్థానాలు చేజారిపోతాయని చెప్పుకు వచ్చారట.

అయితే కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన వేరేలా ఉందట. హై కమాండ్ ఆలోచనల మేరకే షర్మిలను శివకుమార్ కాంగ్రెస్ లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది . ఆంధ్రప్రదేశ్ లో జగన్ ను కాదని తెలంగాణ లో పార్టీ పెట్టి కేసీఆర్ పాలన మీద దుమ్మెత్తి పోస్తున్న షర్మిలను తీసుకోవడం ద్వారా తమకు స్టార్ క్యాంపెయినర్ దొరకడంతో పాటు , తెలంగాణాలో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి (YS RAjashekar reddy) అభిమానుల ఓట్లను కొల్లగొట్టవచ్చనే ఆలోచనతో కాంగ్రెస్ ఉంది. షర్మిల వల్ల రాబోయే ఎన్నికల్లో ఓట్లు రాలుతాయనే ఆశాభావంతో ఉన్నారు . ఇదే అవకాశాన్ని షర్మిల పక్కాగా ఉపయోగించుకోవాలని చూస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ..తెలంగాణాలో ఎంత పోరాడినా ఒక్క సీటు కూడా గెలిచే స్థితిలో లేని షర్మిల కు కాంగ్రెస్ ఆహ్వానం నెత్తిన పాలు పోసినట్లయింది . మంచి అవకాశంగా భావించిన షర్మిల పార్టీనీ విలీనం చేసి కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు దాదాపు సిద్ధమైందని సమాచారం . ఈ విషయాన్ని షర్మిల కూడా నర్మ గర్బంగ ధ్రువీకరించింది . కాంగ్రెస్ పార్టీ నుంచి మిస్డ్ కాల్స్ వస్తున్నాయని వెల్లడించింది . షర్మిల చేరికను కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ససేమీరా అంటున్నారు . షర్మిల రూపంలో కేసీఆర్ కు కాంగ్రెస్ ను విమర్శించడానికి మంచి అస్త్రం అందించిన వారిమవుతామని చెబుతున్నారు .మళ్ళీ సీమాంధ్రుల చేతుల్లోకి తెలంగాణ వెళుతుందని షర్మిలని సాకుగా చూపెట్టి లాభపడాలని బీఆర్ఎస్ చూస్తుందని , దీనివల్ల కాంగ్రెస్ కు నష్టం అని చెబుతున్నారు


షర్మిలను వద్దనడం వెనుక పెద్ద మర్మం ఉందని కాంగ్రెస్ పార్టీలోనే చెవులు కొరుక్కుంటున్నారు . వై ఎస్ రాజశేఖర్ రెడ్డి తనయగా రాష్ట్ర రాజకీయాల్లో సుపరిచితురాలైన షర్మిల ..రేపటిరోజున తమ రాజకీయ ఎదుగుదలకు అడ్డంకిగా మారుతుందని ఇప్పుడే సీనియర్లు అడ్డుకుంటున్నారని ప్రచారం జరుగుతున్నది . ఇంకా లోతుల్లోకి వెళ్తే విస్తుపోయే నిజం తెలిసింది. కాంగ్రెస్ గెలిస్తే తమకు ముఖ్యమంత్రి పదవి రాకుండా అడ్డు తగిలి… షర్మిలే ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నాలు చేస్తుందనే అనుమానంతో ఆదిలోనే చెక్ పెడుతున్నారని గుసగుసలు వినపడుతున్నాయి . అదికూడా నిజం అనే వాళ్ళు లేకపోలేదు .డీకే శివకుమార్ తో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్ననాటినుంచే రాజకీయ సంబంధాలున్నాయి . స్వంత అన్న జగన్ అండగా ఉండటం, అవసరమైతే షర్మిలను గద్దె ఎక్కించడానికి ఆర్థిక బలం కూడా ఉండటం వంటి ఎన్నో అనుకూల అంశాలు ఉన్నాయి .ఇవే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుల్లో కలవరానికి గురి చేసున్నది . తమకు సీఎం పదవి చేజారుతుందని ఆందోళనతో షర్మిల రాకను వ్యతిరేకిస్తున్నారు . మొదట కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి కృషి చేయాల్సింది పోయి ముఖ్యమంత్రి పీఠం మీద ఆశపడటం కాంగ్రెసుకే చెల్లింది..చెల్లుతుంది కూడా. సహజ లక్షణం ఎటు పోతుంది మరి . గెలవక ముందే ఇన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించేవాళ్లు .. ఇక గెలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు . ప్రస్తుతానికి ఐకమత్యంగా కనిపిస్తున్నా ..ఇది ఎన్నాళ్ళు కొనసాగుతుందో చూడాలి . ఇది మారుతుందో లేదో తెలియదు కానీ షర్మిల మాత్రం కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయమని గాంధీభవన్ సాక్షిగా కాంగ్రేసోల్లే మాట్లాడుకుంటున్నారు.

Recent

- Advertisment -spot_img