Homeహైదరాబాద్latest Newsగ్యాస్ వినియోగదారుల నుండి అధిక డబ్బులు వసూలు చేస్తున్న ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలి

గ్యాస్ వినియోగదారుల నుండి అధిక డబ్బులు వసూలు చేస్తున్న ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలి

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల కేంద్రంలో ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వారు మండలంలోని వివిధ గ్రామాల్లో గ్యాస్ ఏజెన్సీ నుండి వచ్చామని వినియోగదారుల నుండి 240 వసూలు చేయడం పై వ్యతిరేకించడం జరుగుతుంది. పోతుగల్ గ్రామ యువకులు తోట ధర్మేందర్ కోళ్ల కృష్ణ కస్టమర్ వద్ద నుండి ఎలా డబ్బులు వసూలు చేస్తారని గ్యాస్ ఏజెన్సీని ప్రశ్నించి సంబంధిత సివిల్ సప్లై డిఎస్ఓ జితేందర్ రెడ్డి కి ఫిర్యాదు చేశారు. కస్టమర్ల నుండి గ్యాస్ ఏజెన్సీ సంభందించిన వారు 250 రూపాయలు వసూలు చేస్తున్నారని తెలుపగా కస్టమర్ వద్ద నుండి ఎలాంటి డబ్బులు వసూలు చేయరాదని డిఎస్ఓ జితేందర్ గ్రామ యువకులకు తెలిపారు.

గ్రామస్తులు, వినియోగదారులు పోలీసులకు సమాచారం అందించి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తామని వచ్చిన వినియోగదారులు మండల కేంద్రంలో గ్యాస్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. సంఘటన స్థలానికి సిఐ మొగిలి వచ్చి వినియోగదారులకు నచ్చజెప్పి సంబంధిత సివిల్ సప్లై అధికారి నవీన్ వారితో మాట్లాడి కస్టమర్ నుండి తీసుకున్న 250 రూపాయలు తిరిగి కస్టమర్లకు ఇస్తామని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వారు తెలపడంతో వినియోగదారులు నిరసన విరమించారు. ఏజెన్సీ వారు వినియోగదారులకు ఒక్కరికొకరికి తిరిగి డబ్బులు ఇచ్చారు.

ఈ సందర్భంగా పోతుగల్ యువకులు మాట్లాడుతూ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వారు 240 రూపాయలు వసూల్ ఏ కారణంగా చేస్తారని అడుగుతే ఇన్సూరెన్స్ అలాగే కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం 500 రూపాయల సబ్సిడీ రావాలంటే ఈ రెండు వందల నలభై రూపాయలు కట్టాలని, అదేవిధంగా అనుకోకుండా ఏదైనా సిలిండర్ పేలి చనిపోతే 16 లక్షలు వస్తాయి అని చెప్పి ఇన్సూరెన్స్ ద్వారా మీ ఇంటికి వస్తాయని అన్నారు. గతంలో కూడా ఏజెన్సీ పైన ఫిర్యాదు కూడా ఉన్నాయని సిలిండర్ డెలివరీ చేసినప్పుడు అదనంగా వసూలు చేస్తున్నారని ఐదు కిలోమీటర్ పరిధిలోపు ఉచితంగా గ్యాస్ డెలివరీ చేయాలని నిబంధన ఉన్నప్పటికీ వినియోగదారుల నుండి 30 రూపాయలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఇటువంటి గ్యాస్ ఏజెన్సీ పై చర్యలు తీసుకొని వారి లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్యాస్ ఏజెన్సీ వారిని వివరణ కోరగా కస్టమర్ల ఒప్పందం మేరకే గ్యాస్ పైప్ రెగ్యులేటర్ వంటి చెకప్ కొరకు గ్యాస్ ఏజెన్సీ పేరు మీద 236 రిసిప్ట్ ఇచ్చి డబ్బులు తీసుకున్నామని తెలిపారు.

Recent

- Advertisment -spot_img