ఎగువ సభ, పెద్దలసభ, శాశ్వత సభ అనే చెప్పుకునే శాసనమండలికి బల్మూరి వెంకట్ ఈ 29న ఎన్నిక కాబోతున్నారు. అయితే ఆయన అతిచిన్న వయస్సులో శాసనమండలిలో అడుగు పెట్టనున్న నేతగా రికార్డుల్లోకి ఎక్కబోతున్నారు. ప్రస్తుతం బల్మూరి వెంకట్ వయస్సు 31 ఏళ్ల.. 3 నెలలు. అయితే ఉమ్మడి ఏపీ, ప్రస్తుత తెలంగాణ చరిత్రలో ఇంత చిన్న వయస్సులో ఇంతవరకు ఎవరూ శాసనమండలికి ఎన్నిక కాకపోవడం గమనర్హం.
ఇది చదవండి: ఆడవారికి బిగ్ షాక్.. హైకోర్టులో ఫ్రీ బస్సు ప్రయాణంపై పిటిషన్
ఏపీలో రేవంత్.. తెలంగాణలో బల్మూరి వెంకట్
2007లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో అతి చిన్న వయస్సుడిగా ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి అడుగుపెట్టి రికార్డు సృష్టించారు. రేవంత్ రెడ్డి 2007లో స్థానిక సంస్థల కోటాలో గెలిచి ఎమ్మెల్సీ అయ్యారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి వయస్సు 37 ఏళ్లు. ఆ తర్వాత పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ శాసనమండలిలో బీఆర్ఎస్ తరుఫున 37 ఏళ్ల వయస్సులో అడుగుపెట్టారు.
ఇది చదవండి: ఆ పాటతో ప్రభుత్వమే మారింది: కేటీఆర్
సీఎం రేవంత్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరి రికార్డులను బల్మూరి వెంకట్ అధిగమించి రికార్డులోకి ఎక్కనున్నారు. బల్మూరి వెంకట్ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో యంగెస్ట్ ఎమ్మెల్సీ తానేనని సంతోషంగా చెప్పుకొచ్చారు. ఈ 29న ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండగా.. అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు.