Homeహైదరాబాద్latest NewsBREAKING: జర్నలిస్ట్ చిలుక ప్రవీణ్ పై దాడి.. ఫోటో వైరల్..

BREAKING: జర్నలిస్ట్ చిలుక ప్రవీణ్ పై దాడి.. ఫోటో వైరల్..

జర్నలిస్ట్ చిలుక ప్రవీణ్ పై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. చిలుక ప్రవీణ్​ ప్రతి రోజు యూట్యూబ్​ చానల్​ లో వార్తా పత్రికల విశ్లేషణలు చేస్తుంటారు. తీన్మార్​ మల్లన్నకు వ్యతిరేకంగా నిత్యం ఆయన ఓ యూట్యూబ్​ చానల్​ లో మాట్లాడుతుంటారు. కాంగ్రెస్​ ప్రభుత్వం చేసే తప్పిదాలను కూడా ఎత్తి చూపుతుంటారు. చిలుక ప్రవీణ్​ గతంలో తీన్మార్​ మల్లన్నకు సంబంధించిన చానల్​ లోనే పనిచేసేవారు. ఆ తర్వాత విబేధాలు తలెత్తి బయటకు వచ్చారు.

తాజాగా చిలుక ప్రవీణ్​ మీద దాడి జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దాడి కాంగ్రెస్​ కార్యకర్తలు చేశారా? లేక తీన్మార్​ మల్లన్న అనుచరులు చేశారా? అన్నది వేచి చూడాలి. చిలుక ప్రవీణ్​ మీద దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్​ అయ్యాయి. ఈ ఘటన ఎక్కడ జరిగిందో స్పష్టంగా తెలియడం లేదు. ఇందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.

Recent

- Advertisment -spot_img