– ఎయిర్‌పోర్టులో రన్‌వేపైకి వర్షపు నీరు
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: మిగ్ జాం తుపాన్‌తో తమిళనాడు రాజధాని చెన్నై అతలాకుతలమైంది. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. పలు చోట్ల వీధుల్లోకి భారీగా వరద నీరు చేరి పలు కార్లు కొట్టుకుపోయాయి. చెన్నై ఎయిర్‌పోర్టు రన్‌వేపైకి భారీగా వరద చేరింది. దీంతో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటివరకు 16 విమాన సర్వీసులను రద్దు చేశారు. మరికొన్ని విమానాలను దారిమళ్లించారు. సోమవారం అర్ధరాత్రి వరకు ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వర్ష బీభత్సానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.