Homeహైదరాబాద్latest Newsఏపీలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. తెలంగాణలో సంబరాలు

ఏపీలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. తెలంగాణలో సంబరాలు

ఇదే నిజం, బెల్లంపల్లి: బెల్లంపల్లి టి ఎన్ టి యు సి కార్యాలయంలో సంబరాలు నిర్వహించిన స్థానిక నాయకులు టిఎన్టియుసి ప్రధాన కార్యదర్శి టీ.మనీ రామ్ సింగ్, ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో తమ నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా మేము మా కార్యాలయంలో స్వీట్లు పంచిపెట్టి సంబరాలు చేసుకుంటున్నామని తెలియజేశారు. తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ చేసిన సేవలు గుర్తు చేశారు.

రాబోయే కాలంలో తెలంగాణలో టిడిపి బలోపేతం చేస్తే ప్రజలకు సేవ చేస్తామని వారు అన్నారు. టిడిపి హయాంలోనే కార్మికులకు కర్షకులకు దళితులకు మైనార్టీలకు బడుగు బలహీన ప్రజలందరికీ న్యాయం చేసిన ఒకే ఒక పార్టీ టిడిపి పార్టీ అని, కార్మికులకు పరుగు పందెం ద్వారా న్యాయం చేసిన ఒకే ఒక పార్టీ టిడిపి పార్టీ అని వారు గుర్తు చేశారు. ఇకనైనా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేయాలని వారు కోరారు‌. రాబోయే కాలంలో టిడిపిని గెలిపించుకుంటే పూర్వ వైభవం తెలంగాణకు వస్తుందని అందరికీ న్యాయం జరుగుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Recent

- Advertisment -spot_img