Homeహైదరాబాద్latest Newsనిరుద్యోగులను మోసం చేస్తున్న కాంగ్రెస్: ఎబివిపి దేవరకొండ శాఖ

నిరుద్యోగులను మోసం చేస్తున్న కాంగ్రెస్: ఎబివిపి దేవరకొండ శాఖ

ఇదే నిజం దేవరకొండ: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఎలాంటి నిరసనలకు కానీ ధర్నాలకు పిలుపు ఇవ్వక పోయినా ప్రభుత్వం మారింది కానీ, ప్రభుత్వ తీరు మారలేదు. అక్రమ అరెస్ట్ లు ఆగలేదు. ఎబివిపి దేవరకొండ కార్యకర్తలను ఉదయం పోలీసులు అరెస్ట్ చేసి చందంపేట పోలీస్ స్టేషన్ మరియు దేవరకొండ పోలీస్ స్టేషన్ లో ఉంచడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్నా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని ఏబీవీపీ సభ్యులు యలమల గోపీచంద్ ప్రభుత్వంపై మండిపడ్డారు. దేవరకొండ మండల కేంద్రంలో ఏబీవీపీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఉద్యోగాల పేరుతో ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తుందని ఆరోపించారు. మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర కార్యవర్గ సభ్యులు ముదిగొండ అరవింద్, సైదులు, ఎయిర్టెల్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img