Homeఫ్లాష్ ఫ్లాష్“పుష్ప 2” డ్యూయెట్ సాంగ్ కి డేట్ ఫిక్స్.. రష్మిక పై చిన్న బైట్ వీడియో...

“పుష్ప 2” డ్యూయెట్ సాంగ్ కి డేట్ ఫిక్స్.. రష్మిక పై చిన్న బైట్ వీడియో తో అప్డేట్..!

డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న చిత్రం “పుష్ప 2 ది రూల్”. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కు నేషనల్ వైడ్ గా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ పుష్ప పుష్ప అంటూ సాగే పాటను మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ‘పుష్ప పుష్ప’ లిరికల్‌ సాంగ్‌ను మొత్తం 6 భాషల్లో చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అయితే నిన్ననే రెండో పాటకు సంబంధించి నిన్న అప్‌డేట్ ఇస్తున్నామని హింట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు దీనిపై క్లారిటీ వచ్చింది. రష్మిక పై చిన్న బైట్ వీడియోతో కూడిన సూసేకి అంటూ సాగే పాటను మే 29 ఉదయం 11:07 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ చిత్రంలో ఫాహద్ ఫాసిల్, అనసూయ భరద్వాజ్, ధనంజయ, రావు రమేష్, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా ఆగస్టు 15న పాన్ ఇండియా భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది.

Recent

- Advertisment -spot_img