Homeహైదరాబాద్latest Newsబాలికల ఉన్నత పాఠశాలను సందర్శించిన జిల్లా ఉన్నత విద్యాధికారి

బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించిన జిల్లా ఉన్నత విద్యాధికారి

ఇదే నిజం, గూడూరు: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను మహబూబాబాద్ జిల్లా ఉన్నత విద్యాధికారి సందర్శనకు ప్రార్థన సమయానికే హాజరయ్యారు. అనంతరం పదవ తరగతి విద్యార్థులతో ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. 2023 24 విద్యా సంవత్సరం 10వ, తరగతి విద్యార్థుల ఫలితాలను అడిగి, ఉపాధ్యాయులను, విద్యార్థులను అభినందించారు. ప్రస్తుత పదవ తరగతి విద్యార్థుల 9వ తరగతి అన్యువల్ పరీక్షల ఫలితాలను అడిగి, ఫెయిల్ అయిన వారిని చైతన్యపరిచే విధంగా మాట్లాడారు. విద్యార్థుల పరీక్షలలో వచ్చే గ్రేడ్ లను గురించి అవగాహన కల్పించాలని తెలియజేశారు. క్రీడల వివరాలను పొందుపరిచిన షీట్ ను గోడలపై అంటించాలని తెలిపారు. 10వ తరగతి విద్యార్థులకు స్లిప్ టెస్టులను నిర్వహించి, మార్కుల పట్టికను తయారు చేశారు. 10/10 గ్రేడ్ పాయింట్లు వచ్చే విధంగా విద్యార్థులను ప్రోత్సహించాలని సూచించారు. తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులను నిరుత్సాహ పడకుండా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని, ఇతర పాఠశాల లతో పోటీపడి చదవాలని తెలియజేశారు. 10/10 గ్రేడ్ పాయింట్లు ఎంత మందికి వస్తాయని అడగగా, 20 మంది విద్యార్థులు చేతులెత్తారు. 20 మంది చెప్పినట్లుగా 10/10 గ్రేడ్ పాయింట్లు వచ్చే విధంగా కృషి చేసి పాఠశాలకు తీర్చేయాలని తెలిపారు. ప్రార్థనా సమయంలో విద్యార్థులు చక్కగా గేయం ఆలపించినందుకు అభినందించారు. ఫిజిక్స్, సైన్స్ ఉపాధ్యాయుడు స్వామి రిటైర్మెంట్ అయినందున, ప్రక్క పాఠశాల నుండి సబ్జెక్టును చెప్పించుకోవాలని సూచించారు.

Recent

- Advertisment -spot_img