Homeహైదరాబాద్latest Newsకుక్కలకి ఉచిత ఆంటీ రాబిస్ టీకాలు తప్పనిసరి: వెటర్నరీ డాక్టర్ రవీందర్

కుక్కలకి ఉచిత ఆంటీ రాబిస్ టీకాలు తప్పనిసరి: వెటర్నరీ డాక్టర్ రవీందర్

ఇదే నిజం,గొల్లపల్లి: ప్రపంచ జూనోసిస్ దినం (world zoonosis Day) సందర్బంగా జులై 6వ తేదీ శనివారం రోజున ఉదయం 9 గంటల నుండి గొల్లపల్లి ప్రాథమిక పశువైద్య కేంద్రంలో కుక్కలకి ఉచిత ఆంటీ రాబిస్ టీకాలు వేయడం జరుగుతుంది. జంతువులు అంటే ఇష్టపడని వారు ఉండరు, వాటితో మానవులకి విడదీయలేని అనుబంధం ఏర్పడింది. పాలు ,మాంసం, రక్షణ కోసం మానవుడు వాటిపై ఆధారపడుతున్నాడు. అయితే డాగ్స్ నుండి రేబిస్ వ్యాధి గోజాతి గేదె జాతి పశువుల నుండి బృసెల్లా, ఆంథ్రక్స్ లాంటి వ్యాధులు కోళ్ల నుండి బర్డ్ ఫ్లూ లాంటి చాలా రకాల వ్యాధులు పశువుల నుండి మనుషులకు సంక్రామించే అవకాశం ఉంది.
ముఖ్యంగా పెంపుడు జంతువుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాటికీ సకాలంలో టీకాలు వేయించడం వల్ల వాటి నుండి వ్యాధి సంక్రామానని నిరోదించవచ్చు. ఏటా జులై 6వ తేదీన ప్రపంచ జూనోసిస్ డే ని పురస్కరించుకొని పెంపుడు కుక్కలకి ఆంటీ రేబిస్ టీకాలు వేయడం జరుగుతుంది. కావున జులై 6వ తేదీన మండలంలోని అన్ని గ్రామాలలో ఉన్నటువంటి మీ డాగ్స్ కి గొల్లపల్లి వెటరినరీ హాస్పిటల్ దగ్గర ఆంటీ రేబిస్ టీకాలు వేయించుకోగలరు.

Recent

- Advertisment -spot_img