ఇప్పుడు తెలంగాణలో అమలు చేసిన విధంగా ఏపీలో కూడా ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత సౌకర్యం కల్పిస్తామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో మహిళలందరికీ మహాలక్ష్మీ పథకం కింద నెలకు రూ.1500 ఇస్తానని మాజీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. తల్లికి వందనం కింద రూ.15వేలు ఇస్తాం. 3 సిలిండర్లు ఉచితంగానే ఇస్తామన్నారు. రూ.20లక్షల ప్రభుత్వం, ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చేలా చేస్తామన్నారు. నిరుద్యోగులకు రూ.3వేలు, అన్నదాతలకు ఏటా రూ.20వేలు ఇస్తామని చంద్రబాబు చెప్పారు.