Homeహైదరాబాద్latest Newsధర్మపురిలో స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహ సంస్కృతాంధ్ర కలశాలను తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం జీవో జారీ

ధర్మపురిలో స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహ సంస్కృతాంధ్ర కలశాలను తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం జీవో జారీ

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో శుక్రవారం రోజున ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు..మీడియా సమావేశ ముఖ్యాంశాలు,దాదాపు 60 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ లక్ష్మీ నరసింహ సంస్కృతాంధ్ర కలశాలను గత పాలకుల అనలోచిత నిర్ణయాల వల్ల బోధన అధ్యాపకులు లేక మూతబడటం జరిగింది.

ఇందులో చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు ఇప్పుడు పెద్ద పెద్ద హోదాలో ఉండటం జరిగింది. 2009 నుండి వరకు ఓడిన గెలిచిన ప్రజల మధ్య ఉంటు ప్రజా సమస్యల పై పోరాటం చేయడం జరిగింది, ఈ కలశాల మూతబడినప్పుడు చాలా భాధగా అనిపించింది. తాను ఎమ్మెల్యే గా గెలిచిన తర్వాత స్థానిక నాయకులు ఇట్టి కలశాలను తిరిగి తెరిపించాలని నా దృష్టికి తీసుకురావడం జరిగింది,నేను వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,మంత్రి వర్యులు శ్రీధర్ బాబు,మరియు హయ్యర్ ఎడ్యుకేషన్ అధికారుల దృష్టికి ఇట్టి విషయాన్ని తీసుకెళ్లడం జరిగింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,మంత్రివర్యులు శ్రీధర్ బాబు,జిల్లా కలెక్టర్ మరియు ఉన్నత విద్య అధికారుల చొరవతో కలశాల తిరిగి ప్రారంభం కావడం జరిగింది.నేను ఇచ్చిన మాటను వందకు వందశాతం అమలు చేయడానికి నా శాయశక్తుల ప్రయత్నిస్తాను.
ఇట్టి కలశాల భవన మరమత్తులు మరియు ఇతల అవసరాల నిమిత్తం నా ACDP ఫండ్స్ నుండి 5 లక్షల రూపాయల ఇవ్వడం జరుగుతుంది,దానికి సంబందించి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న BRS నాయకులు ఎందుకు ఈ కలశాలను పట్టించుకోలేదు,ధర్మపురిలో ఒక డిగ్రీ కళాశాల,బస్ డిపో, ఐటీఐ కళాశాల,రెవెన్యూ డివిజన్ ఏర్పాటులో తన వంతు కృషి చేస్తానని దైవ క్షేత్రానికి సంబంధించిన నైట్ కాలేజీ ప్రారంభోత్సవంలో నాకు సహకారం అందించిన సీఎం రేవంత్ రెడ్డి కి, మంత్రి శ్రీధర్ బాబు కి జిల్లా కలెక్టర్ కి మరియు హైయర్ ఎడ్యుకేషన్ అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తూన్నాను.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ సంఘనపట్ల దినేష్ వేముల రాజేష్ చిలుముల లక్ష్మణ్ సింహరాజు ప్రసాద్ జక్కు రవీందర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img