– ఆర్థిక లావాదేవీలపై ఆరా
ఇదే నిజం, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో పలు చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి. సోమవారం ఓ ఫార్మా కంపెనీకి చెందిన డైరెక్టర్ల ఇళ్లు, ఆఫీసులు, కంపెనీ సిబ్బంది ఇళ్లల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. పది బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు.. ఆర్సీపురంలోని నాగులపల్లి, అమీన్‌పూర్‌లోని పటేల్‌గూడ, గచ్చిబౌలిలోని మైహోమ్ భుజాలో సోదాలు చేస్తున్నారు. ఫార్మా కంపెనీ డైరెక్టర్ల బ్యాంకు వివరాలు, ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. సంస్థకు సంబంధించి ఆదాయ పన్ను చెల్లింపుల్లో అవకతవకలు జరిగినట్లు సమాచారం.