Homeహైదరాబాద్latest Newsనలుగురికి ఖేల్‌ రత్న.. 32 మందికి అర్జున్ అవార్డు..!

నలుగురికి ఖేల్‌ రత్న.. 32 మందికి అర్జున్ అవార్డు..!

భారత అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌ రత్న అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నలుగురు క్రీడాకారులకు కేంద్రం ఈ అవార్డులను ప్రకటించింది. మను బాకర్ (షూటింగ్‌), హర్మన్‌ప్రీత్ సింగ్ (హాకీ), ప్రవీణ్‌ కుమార్ (పారా అథ్లెట్), డి.గుకేశ్‌ (చెస్) ఖేల్‌ రత్నకు ఎంపికయ్యారు. 17 మంది పారాఅథ్లెట్లు సహా 32 మంది అర్జున అవార్డులకు ఎంపికయ్యారు. మొత్తం 32 మందికి అర్జున్ అవార్డులను ప్రకటించగా అందులో ఇద్దరు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. అథ్లెటిక్స్ విభాగంలో యర్రాజి జ్యోతి (విశాఖ), పారా అథ్లెటిక్స్ నుంచి జీవాంజి దీప్తికి (ఉమ్మడి వరంగల్) అర్జున్ అవార్డులు ఇవ్వనున్నట్లు కేంద్ర క్రీడల శాఖ కాసేపటి క్రితం పేర్కొంది. వీరు ఈనెల 17న రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు.

ఇవి కూడా చదవండి:
* రాశి ఫలాలు (02-01-2025, గురువారం)
* మహిళలకు బిగ్ షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..!



Recent

- Advertisment -spot_img