Homeబిజినెస్‌Instant Loan : ఇన్​స్టంట్​ లోన్​ తీసుకునేముందు ఇవి తెలుసుకోవాల్సిందే

Instant Loan : ఇన్​స్టంట్​ లోన్​ తీసుకునేముందు ఇవి తెలుసుకోవాల్సిందే

Instant Loan : ఇన్​స్టంట్​ లోన్​ తీసుకునేముందు ఇవి తెలుసుకోవాల్సిందే

Instant Loan: అవసరానికి అప్పు తీసుకోవాలంటే ఒకప్పుడు ఎన్నో రోజులు పట్టేది.

ఎన్నో కాగితాలు సమర్పించాల్సి వచ్చేది. మారుతున్న డిజిటల్‌ యుగంలో రుణాల తీరూ మారిపోయింది.

దేశంలో ఎన్నో ఫిన్‌టెక్‌ సంస్థలు అప్పులిచ్చేందుకు సిద్ధమవడంతో క్షణాల్లోనే అవసరమైన నగదు బ్యాంకు ఖాతాలో జమ అవుతోంది.

ఏదైనా అత్యవసరం వచ్చి, ఈ ‘ఇన్‌స్టంట్‌ లోన్ల’ను తీసుకునేముందు పరిశీలించాల్సిన విషయాలూ కొన్ని ఉంటాయి.

Metabolism exercise : ఈ వ్యాయామంతో మెటబాలిజం మెరుగు.. క్యాలరీలు ఖర్చు..

Star Kisan Ghar : రైతులకు ఐటీ రిటర్న్స్ లేకుండానే 50లక్షల వరకు ఇంటి రుణం

అడిగి మరీ వెంటనే రుణం ఇస్తున్నారు కదా అని అవసరం లేకపోయినా రుణం తీసుకుంటున్న వారు ఎంతో మంది.

వడ్డీ రేటు మాత్రమే విని, సరే అని చెప్పేవారు ఇందులో అధికం. కానీ, అంతకుమించి చూడాల్సినవి ఎన్నో ఉన్నాయి.

ఏమాత్రం తేడా వచ్చినా భారం అధికంగా ఉంటుందన్న సంగతి విస్మరించకూడదు.

వడ్డీ రేటుతోపాటు, ప్రాసెసింగ్‌ ఫీజు, ఇతర ఖర్చులూ రుణభారాన్ని పెంచుతాయి.

గుర్తింపు ఉందా?

మొబైల్‌ ఫోను చేతిలో ఉంటే చాలు.. రుణాలిచ్చే ఎన్నో ఫిన్‌టెక్‌ యాప్‌లు సిద్ధంగా ఉన్నాయి.

ముందుగా వీటిలో వేటికి ఆర్‌బీఐ అనుమతి ఉంది.. ఏవి బ్యాంకులతో కలిసి పనిచేస్తున్నాయని తనిఖీ చేసుకోవాలి.

గుర్తింపు లేని సంస్థల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ రుణాలు తీసుకోవద్దు.

Reliance : రిలయన్స్ ఇండ‌స్ట్రీస్ కీల‌క నిర్ణ‌యం

Ginger Health Benefits : అల్లంతో ఎన్ని ప్రయోజనాలో…

అనధికారంగా రుణాలిచ్చే సంస్థల నుంచి అప్పు తీసుకుంటే.. రుణగ్రహీతకు ఉండే ఏ హక్కులూ ఉండవు.

ఇది తీవ్ర పరిణామాలకు దారి తీయొచ్చు.

చిన్న రుణాలతో..

తీసుకున్న అప్పును సకాలంలో తీర్చడం ఒక బాధ్యత.

అయితే, తక్కువ వ్యవధికి తీసుకునే సూక్ష్మరుణాలకు వడ్డీ భారం అధికంగా ఉంటుంది.

పైగా ఆ లోపు తీర్చకపోతే అధిక భారం పడుతుంది. కాబట్టి, రూ.20వేలకు మించిన రుణాన్ని 90 రోజులకు తక్కువ వ్యవధికి తీసుకోవద్దు.

Reverse Walking : వ్యాయామంలో.. వెనక్కి వాకింగ్‌తో షాకింగ్ రిజ‌ల్ట్స్‌

Krithi Shetty : ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి

స్వల్పకాలంలో అధిక మొత్తాన్ని తీర్చడం అన్నిసార్లూ సాధ్యం కాకపోవచ్చు.

కొత్త రుణం తీసుకొని, పాత రుణాన్ని తీర్చడంలాంటివి చేస్తే అప్పుల ఊబిలో కూరుకుపోతాం.

అవసరం మేరకే..

కొన్నిసార్లు ఫిన్‌టెక్‌ సంస్థలు మనకు అధిక మొత్తంలో రుణం ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటాయి.

కానీ, మన అవసరం ఎంత అనేదీ చూసుకోవాలి.

ఇస్తున్నారు కదా అని అధిక మొత్తం తీసుకుంటే.. తర్వాత చెల్లించడం కష్టమవుతుందని మర్చిపోవద్దు.

Gothram : గోత్రం అంటే ఏమిటి? దీని వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటి

Samantha Ruth Prabhu : ఇతరుల అభిప్రాయాలు అవసరం లేదు..

మీ అవసరం, తీర్చే సామర్థ్యం రెండూ బేరీజు వేసుకొని, ఎంత తీసుకోవాలన్నది నిర్ణయించుకోండి.

రుణం కోసం ఒకేసారి రెండు మూడు సంస్థలకు దరఖాస్తు చేయకూడదు.

దీనివల్ల మీ రుణ అర్హతపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

అప్పు తీసుకునేటప్పుడు దరఖాస్తు పత్రంతోపాటు, రుణ ఒప్పందాన్నీ ఒకసారి పూర్తిగా పరిశీలించండి.

నియమనిబంధనలు పూర్తిగా తెలుసుకున్నాకే ముందడుగు వేయండి.

Banking Rules : మారిన బ్యాంకుల రూల్స్​.. కొన్ని భారం.. మరికొన్ని మంచి..

Walmart | వాల్‌మార్ట్ కొనుగోలు దిశ‌గా అంబానీ.. రిల‌య‌న్స్ ప‌గ్గాలు వ‌దులుకోనున్న ముకేశ్

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img