Homeహైదరాబాద్latest Newsగిరిజన ఆశ్రమ బాలుర పాఠశాలలో వైద్య శిబిరం

గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాలలో వైద్య శిబిరం

ఇదే నిజం, గూడూరు: మండల కేంద్రం పరిధిలోని, మారుమూల గ్రామపంచాయతీ మట్టేవాడ పరిధిలోని గల గిరిజన ఆశ్రమ పాఠశాల బాలుర లో, మహబూబాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కళావతి బాయి ఆదేశాల మేరకు, అయోధ్యాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం విద్యాధికారి డాక్టర్ బి. యమున ఆధ్వర్యంలో, గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల కు ఈ వర్షాకాలం లో దోమలద్వారా వచ్చే మలేరియా, డెంగీ వంటి జ్వరాలు రాకుండా ఉండడానికి దోమల మందు పిచికారీ చేయించి, అనంతరం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించి, 168 పిల్లలకు గాను 67 మంది పిల్లలకు వైద్య పరీక్షలు చేసి జలుబు, దగ్గు, దురదలు వంటి చిన్న చిన్న జబ్బులతో బాధపడుతున్న పిల్లలకు మందులు ఇచ్చి, ఇద్దరు జ్వర పిడితులను గుర్తించి మలేరియా ఆర్ డి టి. టెస్టులు చేసి, రక్తనమునాలు సేకరించి లాబ్ కు పంపారు. క్యాంప్ అనంతరం డాక్టర్ యమున వైద్య సిబ్బందితో కలిసి, ఆశ్రమ పాఠశాల పరిసరాల ప్రాంతాన్ని సందర్శించి కిచెన్, స్టోర్ రూమ్, వంటగదిని పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు. ఈ వర్షాకాలంలో పిల్లలు తమ వ్యక్తిగత పరిశుభ్రతలు పాటించాలని సూచించారు. ఈ వైద్య శిబిరంలో మట్టేవాడ పల్లె దవాఖాన డాక్టర్ నరేష్, ఆశ్రమ పాఠశాల హెచ్ డబ్ల్యు ఓ. సురేందర్, పి హెచ్ ఎన్ కోమల, హెచ్ ఈ ఓ. లోక్య నాయక్, సూపర్వైజర్లు గణేష్, అరుణమ్మ, హెల్త్ అసిస్టెంట్ సర్దార్ బాబు, ఏఎన్ఎం కవిత, పుష్పాలత, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img