Homeజిల్లా వార్తలుఘనంగా మిలన్ -నబి పండుగ వేడుకలు జరుపుకున్న ముస్లిం సోదరులు..

ఘనంగా మిలన్ -నబి పండుగ వేడుకలు జరుపుకున్న ముస్లిం సోదరులు..

ఇదే నిజం, కామారెడ్డి జిల్లా: కామారెడ్డి జిల్లా జుక్కల్ ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా భావించే మిలాన్ నబి పండుగ వేడుకలు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నారు. మమ్మద్ ప్రవక్త పుట్టినరోజు పురస్కరించుకొని ఈ పండుగలు అతి వైభవంగా నిర్వహించుకుంటారు. మమ్మద్ ప్రవక్త చేసిన సూక్తులను వారు స్ఫూర్తిగా తీసుకొని ఆ దిశగా అడుగులు వేస్తారు ముస్లిం సోదరులు.సోమవారం జుక్కల్ మండల కేంద్రంలో ఘనంగా మహమ్మద్ ప్రవక్త (గులాబిన్ నబీ) జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లింలు జామియా మజీద్ నుంచి అంబేడ్కర్ చౌరస్తా మీదుగా ఖతిజ్ మజీద్, జామియా మజీద్ వరకు శోభాయాత్ర నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎస్సై భువనేశ్వర్ ను సన్మానించారు. ఇందులో ఆలిమ్ సాబ్, అబ్దుల్ సుభాన్ సాబ్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img