ప్రధాని మోదీని పాకిస్థానీ – అమెరికన్ వ్యాపారవేత్త సాజిద్ తరార్ పొగడ్తల్లో ముంచెత్తాడు. ‘మోదీ ఒక గొప్ప నాయకుడు. కేవలం భారత్‌కే కాక ప్రపంచానికీ ఆయన సేవలు అవసరం. మా పాకిస్తాన్‌కు కూడా మోదీ లాంటి నాయకుడు రావాలని అశిస్తున్నాం. ఆ దేశంతో చర్చలు జరిపి వాణిజ్యం ప్రారంభిస్తే బాగుంటుంది. 2024లో భారత్ అభివృద్ది అద్భుతంగా ఉంది. మళ్లీ మోదీయే గెలుస్తారు. భవిష్యత్ అంతా భారత్‌దే’ అని అన్నారు.