Homeహైదరాబాద్latest News"పుష్ప పుష్ప" సాంగ్ కు గ్లోబల్ లెవెల్ లో అదిరిపోయే రెస్పాన్స్…!

“పుష్ప పుష్ప” సాంగ్ కు గ్లోబల్ లెవెల్ లో అదిరిపోయే రెస్పాన్స్…!

డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న చిత్రం “పుష్ప 2 ది రూల్”. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ కు నేషనల్ వైడ్ గా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. అయితే నిన్న ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ పుష్ప పుష్ప అంటూ సాగే పాటను పాన్ ఇండియా బాషల్లో మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే విడుదలైన 24 గంటల్లోనే ఈ పాట 9 దేశాల్లో ట్రెండ్ అవుతూ ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందుతోంది. ఈ పాట తెలుగులోనే కాకుండా పలు దేశాల్లోను, అలాగే పాన్ ఇండియన్ భాషల్లో కూడా ట్రెండ్ అవుతుండటం విశేషం. అయితే 24 గంటల్లో ప్రపంచంలో అత్యధికంగా వీక్షించిన పాటగా కూడా నిలిచింది. మొత్తానికి పుష్ప 2 సాంగ్ సౌండ్ గ్లోబల్ లెవెల్లో హిట్ అయ్యిందని చెప్పాలి. ఈ సినిమా ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Recent

- Advertisment -spot_img