Homeఆంధ్రప్రదేశ్స్వర్ణ ప్యాలెస్ ప్రమాదంలో 6 మంది గల్లంతు 16 మంది మృతి

స్వర్ణ ప్యాలెస్ ప్రమాదంలో 6 మంది గల్లంతు 16 మంది మృతి

స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంలో 16కు చేరిన మృతుల సంఖ్య
సురక్షితంగా బయటపడ్డ పదిమంది.. 6 మంది ఆచూకీ గల్లంతు
ప్రమాదం పై కేసు నమోదు చేసిన పోలీసులు
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం
ప్రమాదానికి శానిటైజర్ కారణమని సమాచారం
ఫోన్లో పరామర్శించిన ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా

రమేష్ హాస్పిటల్ తరఫున కరోనా బాధితులకు వైద్య చికిత్స అందించేందుకు విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన కేంద్రం లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 16 మంది మృతి చెందినట్లు పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి. శానిటైజర్ నిల్వలే ప్రమాదానికి కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీని కారణంగా షార్ట్ సర్క్యూట్ చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. అగ్ని ప్రమాదం సంభవించే సమయంలో అక్కడ 30 మంది కరోనా పేషెంట్లు, వైద్య సిబ్బంది ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రమాద సమయంలో పదిమంది వరకు బాధితులు సురక్షితంగా బయటపడ్డారని పోలీసులు వెల్లడించారు. ప్రమాదం పై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. పోలీస్, వైద్య అధికారులతో మాట్లాడారు. ప్రమాద బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రమాదంలో మృతి చెందిన వారికి రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అగ్నిప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా సీఎం జగన్ తో ఫోన్లో పరామర్శించారు. ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చారు.

Recent

- Advertisment -spot_img