Homeహైదరాబాద్latest Newsపదోన్నతుల పక్రియ పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం కు ధన్యవాదాలు: మ్యాన పవన్ కుమార్

పదోన్నతుల పక్రియ పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం కు ధన్యవాదాలు: మ్యాన పవన్ కుమార్

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో TSCPSEU రాష్ట్ర ఉపాధ్యక్షుడు మ్యాన పవన్ కుమార్ ఉపాధ్యాయులు గత తొమ్మిది సంవత్సరాలు గా ఎదురుచూస్తున్న పదోన్నతులకు న్యాయపరమైన అడ్డంకులను తొలగిస్తూ రాష్ట్ర విద్యా శాఖ పదోన్నతుల ప్రక్రియ ను విజయవంతంగా పూర్తి చేసినందుకు ముఖ్యమంత్రికి మరియ ప్రజా ప్రభుత్వంకు ధన్యవాదాలు తెలుపుతూ తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మ్యాన పవన్ కుమార్ బుధవారం జగిత్యాలలో పత్రిక ప్రకటన విడుదల చేసారు.

ఈ సందర్భంగా మ్యాన పవన్ కుమార్ మాట్లాడుతూ ఎన్నో అడ్డంకులు న్యాయ పరం అయిన చిక్కులను ఎదుర్కొని ఎంతో చాకచక్యంగా ఎట్టి పరిస్థితుల్లో పదోన్నతులు పూర్తి చెయ్యాలనే దృఢసంకల్పం తో రాష్ట్రవ్యాప్తంగా 18,495 మంది ఉపాధ్యాయులు పదోన్నతులు అర్హులు గా గుర్తించి అందులో భాగంగా ప్రధానోపాధ్యాయులుగా 763 స్కూల్ అసిస్టెంట్లుగా 5,123, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా 2,130, భాషా పండితులు, పీఈటీలు 10,479 మంది స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందబోతున్నారు బుధవారం వరకు జోన్ 1 లోని 19 జిల్లాలోని 4900 మంది భాషా పండితులకు, 900 మంది పీఈటీ లను కలుపుకొని దాదాపు పది వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతుల ఉత్తర్వులు ఇచ్చి విజయవంతం చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం కి, డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ దేవసేన కి,విద్యాశాఖాధికారులకులకు కృతజ్ఞతలు తెలిపారు.మరియు ఒక్కరికే ఒక్కటి కన్నా ఎక్కువ పదోన్నతులు వచ్చిన కారణం గా మిగిలిన ఖాళీలను అర్హులైన వారికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గంగాధరి మహేష్,ప్రధాన కార్యదర్శి సర్వ సతీశ్,కోశాధికారి గొల్లపల్లి మహేష్ గౌడ్, బోగ శ్రీనివాస్, జనార్దన్, వంశీ, విరబత్తిని శ్రీనివాస్, బండారి సతీశ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img