Homeహైదరాబాద్latest Newsఅప్పుల బాధతో 4 రోజులు రోడ్డుపై పడుకున్న హీరోయిన్..! ఎవరో తెలుసా..?

అప్పుల బాధతో 4 రోజులు రోడ్డుపై పడుకున్న హీరోయిన్..! ఎవరో తెలుసా..?

చిన్న స్క్రీన్ అయినా, వెండితెర అయినా.. బయటి ప్రపంచం చూడ్డానికి అందంగానే ఉంటుంది కానీ.. ఒక్కోసారి ఈ అబ్బురపరిచే ప్రపంచం వెనుక సినీ తారల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. అయితే ఒక హీరోయిన్ కి పేరు ప్రఖ్యాతులు మరియు డబ్బు ఉన్నాయి, కానీ ఆమె అకస్మాత్తుగా అప్పుల ఊబిలో పడిపోయింది. ఆ నటి మరెవరో కాదు రష్మీ దేశాయ్.. ఈమె టెలివిజన్ టాప్ క్లాస్ నటీమణులలో ఒకరు. ‘ఉత్తరన్’ సీరియల్‌లో తపస్య పాత్రను పోషించిన ఆమె రాత్రికి రాత్రే పాపులర్ అయింది. అయితే కోట్లు సంపాదించిన ఆమె దగ్గర ఒక్క పైసా కూడా మిగలలేదు. ఈ విషయాన్ని నటి తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. అయితే ఒకేసారి కోట్లాది రూపాయల అప్పు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో నాలుగు రోజులుగా రోడ్డుపైనే నిద్రించాల్సి వచ్చిందని, ఆహారం కోసం రూ.20లు రిక్షా డ్రైవర్‌ను అడుక్కున్నానని చెప్పింది. ఆ రిక్షావాడి ఇచ్చిన డబ్బుతో భోజనం చేయాల్సి వచ్చింది అని తెలిపింది.

Recent

- Advertisment -spot_img