Homeహైదరాబాద్latest Newsకేజ్రీవాల్ అరెస్టుపై స్పందించిన ఐక్యరాజ్య సమితి

కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించిన ఐక్యరాజ్య సమితి

United Nations reacts to Kejriwal arrest

ప్రస్తుతం దేశంలో జరుగుతోన్న పరిణామాలపై ఐక్యరాజ్య సమితి కీలక వ్యాఖ్యలు చేసింది. సాధారణ ఎన్నికల ముందు దిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు, కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల ఫ్రీజ్‌ అంశాలను తీవ్రంగా ఖండించింది. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ António Guterres ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘భారత్, ఎన్నికలు జరిగే ఏ దేశంలోనైనా ప్రజల రాజకీయ, పౌర హక్కులు రక్షింపబడతాయని, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేయవచ్చని మేం ఆశిస్తున్నాం’ అని అన్నారు. కేజ్రీవాల్ అరెస్టుపై ఇప్పటికే Germany, United States సైతం స్పందించిన విషయం తెలిసిందే. భారత్‌ మాత్రం ఇవి పూర్తిగా దేశ అంతర్గత విషయాలని.. ఆయా దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించాలని దీటుగానే బదులిచ్చింది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img