మేషం
ఈ రాశి వారికి ఈ వారంలో రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు లాభిస్తాయి. వృత్తిపరంగా సంతృప్తిగా ఉంటారు. వివాహాది శుభకార్యాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. అన్నదమ్ములతో అభిప్రాయ భేదాలు రావొచ్చు. అనవసరమైన చర్చలకు తావివ్వకుండా పనులు పూర్తి చేసుకోవడం మంచిది. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తారు. రాజకీయ పనులు నెరవేరుతాయి. శివారాధన మేలు చేస్తుంది.
వృషభం
ఈ రాశి వారికి ఈ వారంలో ఆత్మీయుల సహకారం లభిస్తుంది. శుభకార్యాలకు హాజరవుతారు. వాహనం, భూమి కొనుగోలు చేస్తారు. ఆత్మవిశ్వాసంతో పనులు చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. నలుగురిలో గుర్తింపు పొందుతారు. విద్యార్థులకు మంచి సమయం. ఇంట్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ, ప్రభుత్వ, కోర్టు పనులలో విజయం చేకూరుతుంది. ఉద్యోగులకు పదోన్నతి, స్థానచలనం అవకాశం. గణపతి ఆలయాన్ని సందర్శించండి.
మిధునం
ఈ రాశి వారికి ఈ వారంలో తలపెట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. నలుగురిలో గుర్తింపు, గౌరవ మర్యాదలు లభిస్తాయి. కుటుంబ పెద్దల సహకారం, కొత్త వ్యక్తుల పరిచయాలతో కార్యసాఫల్యం ఉంటుంది. ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. ఆస్తి విషయంలో అన్నదమ్ములతో ఉన్న విభేదాలు సమసిపోతాయి. రాజకీయ పనులలో ఖర్చులు ఉంటాయి. ప్రభుత్వ పనులలో ఆలస్యం జరగవచ్చు. వ్యాపార లావాదేవీలు కలిసివస్తాయి. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. లక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం.
కర్కాటకం
ఈ రాశి వారికి ఈ వారంలో ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. మంచి సంస్థలలో చేరతారు. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. కోర్టు కేసులలో అనుకూలం. స్థిర, చరాస్తుల మూలంగా ఆదాయం కలిసి వస్తుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిత్యం చేయు వ్యాపారము లాభదాయకంగా కొనసాగుతుంది. సుబ్రహ్మణ్యస్వామి స్తోత్రాలు పఠించండి.
సింహం
ఈ రాశి వారికి ఈ వారంలో వ్యాపారులకు మంచి సమయం. కోర్టు కేసులలో విజయం సాధిస్తారు. భాగస్వాముల మధ్య మంచి సంబంధాలు నెలకొంటాయి. రాజకీయ, ప్రభుత్వ పనులు సకాలంలో పూర్త వుతాయి. ఉద్యోగంలో పదోన్నతి, స్థానచలన సూచన. బంధుమిత్రుల రాకతో ఖర్చులు పెరగవచ్చు. అన్నదమ్ములతో విభేదాలు తలెత్తవచ్చు. అనవసరమైన వాగ్వాదాల జోలికి వెళ్లకండి. వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. కష్టానికి తగిన ప్రతి ఫలం ఉంటుంది. సూర్యారాధన మేలు చేస్తుంది.
కన్య
ఈ రాశి వారికి ఈ వారంలో శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రాబడి పెరుగుతుంది. కొత్త పనుల ప్రారంభంపై మనసు నిలుపుతారు. బంధువర్గంతో కార్యసాఫల్యం ఉంది. కష్టానికి తగిన ప్రతి ఫలం ఉంటుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. విద్యార్థులకు అనుకూలం. మంచి సంస్థలలో చేరే అవకాశం ఉంది. ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. వివాదాలు పరిష్కారం అవుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగులు అధికారుల ప్రశంసలు అందుకుంటారు. రామాలయాన్ని సందర్శించండి.
తుల
ఈ రాశి వారికి ఈ వారంలో ఆత్మీయుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. ఖర్చులు పెరగవచ్చు. భూ వ్యవహారం లాభిస్తుంది. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతారు. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు కొనసాగుతాయి. వ్యాపారం సజావుగా కొనసాగుతుంది. న్యాయ సమస్యలు కొంత వరకు పరిష్కారం అవుతాయి. ఉద్యోగులు అధికారుల విమర్శలు ఎదుర్కోవలసి రావచ్చు. బదిలీ అయ్యే అవకాశం ఉంది. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
వృశ్చికం
ఈ రాశి వారికి ఈ వారంలో ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్నదమ్ములతో వివాదాలు ముందుకు రావచ్చు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది. భూ వ్యవహారం లాభిస్తుంది. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. ఆత్మీయుల సహకారాన్ని పొందుతారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఉద్యోగస్తులకు అధికారుల అండదండలు లభిస్తాయి. కోర్టు పనులు కలిసివస్తాయి. నరసింహస్వామి ఆలయాన్ని దర్శించండి.
ధనుస్సు
ఈ రాశి వారికి ఈ వారంలో రావలసిన డబ్బు అందుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. సంయమనంతో పనులు చేయడం అవసరం. సాంస్కృతిక కార్యక్రమాలు, విందులకు హాజరవుతారు. ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. స్థానచలనం ఉండవచ్చు. పనిభారం పెరిగినప్పటికీ తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది. వ్యాపారం సంతృప్తిగా, లాభదాయకంగా కొనసాగుతుంది. రాజకీయ, ప్రభుత్వ, కోర్టు పనులు అనుకూలిస్తాయి. శివారాధన శుభప్రదం.
మకరం
ఈ రాశి వారికి ఈ వారంలో ఆత్మీయుల సహకారంతో పనులు నెరవేరుతాయి. వాహనం కొనుగోలు చేస్తారు. రావలసిన డబ్బు అందకపోవడంతో పనులలో ఆలస్యం జరుగుతుంది. భక్తి పెరుగుతుంది. నలుగురికి సాయపడతారు. సేవాభావంతో ఉంటారు. తగాదాలకు దూరంగా ఉంటారు. ప్రయాణాలు వాయిదాపడతాయి. అనవసరమైన ఆలోచనలతో మానసికంగా ఇబ్బందిపడతారు. కార్యనిర్వహణలో ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారం సంతృప్తికరంగా కొనసాగుతుంది. గణపతి గుడిని సందర్శించండి.
కుంభం
ఈ రాశి వారికి ఈ వారంలో కొంత లాభిస్తుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనప్పటికీ, పనులు పూర్తిచేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. విద్యార్థులకు అనుకూలం వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ పెద్దల సూచనలతో పనులు నిర్వర్తిస్తారు. సత్ఫలితాలు పొందుతారు. అన్నదమ్ములు, బంధువులతో కార్యసాఫల్యం ఉంటుంది. ఆత్మీయుల తోడ్పాటు లభిస్తుంది. భూతగాదాలు పరిష్కారం అవుతాయి. ఇష్టదైవాన్ని ప్రార్ధించండి.
మీనం
ఈ రాశి వారికి ఈ వారంలో రాజకీయంగా అనుకూల వారం, ప్రభుత్వ పనులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. న్యాయ సమస్యలను అధిగమిస్తారు. వ్యాపార లావాదేవీలు కలిసివస్తాయి. ఉత్సాహంతో ఉంటారు. సంతృప్తిగా పనులు చేస్తారు. ప్రయాణాలు కలిసివస్తాయి. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు రాణిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వివాహాది శుభకార్యాలకు నలుగురి సహకారం లభిస్తుంది. బాల్యమిత్రులను కలుస్తారు. సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించండి.